Homeవింతలు-విశేషాలుViral Video : మందు మత్తులో పాముతోనే పరాచకాలు.. అరగంట పాటు విసిగించాడు.. చివరకు అలా?

Viral Video : మందు మత్తులో పాముతోనే పరాచకాలు.. అరగంట పాటు విసిగించాడు.. చివరకు అలా?

Viral Video :  ‘పులితో వేట.. నాతో ఆట’ చేయలేవు అంటూ బ్రహ్మానందం డైలాగు గుర్తుంది కదూ. కడుపుబ్బ నవ్విస్తుంది ఈ డైలాగ్. అయితే బ్రహ్మానందం విషయంలో ఏమో కానీ.. ఓ మందు బాబు మాత్రం దీనిని చేసి చూపించారు. ఏకంగా పాముతో తలబడి సాహస క్రీడకు తెర తీశారు.మందు మత్తులో ఉంటే ఎంత బాధ అయినా బలాదూర్ అంటారు. ఎదురుగా సింహం ఉన్నా జడిసే పరిస్థితి ఉండదు. కొందరు మందుబాబులు ఏకంగా భారీ జంతువుల ఎంక్లోజర్లు దూరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనే సత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది. కదిరిలో మందు తాగి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు నాగరాజు అనే యువకుడు. స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజీ సమీపంలో వెళ్తున్న సమయంలో ఎదురుగా ఓ తాచుపాము కనిపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నాగరాజు దానిని పాము అనుకున్నాడో… తాడు అనుకున్నాడో తెలియదు కానీ.. దానిని పట్టుకుని రోడ్డుపైకి చేరాడు. జాతీయ రహదారిపై దాంతో హల్చల్ చేశాడు. చేతితో కొడుతూ.. కాలితో తన్నుతూ చిత్రహింసలు పెట్టాడు. అయితే ఆ సమయంలో పాము అలాగే ఉండిపోవడం విశేషం. దాదాపు అరగంట పాటు ఆ పాముతో ఇలానే ఆడుకున్నాడు నాగరాజు. దీంతో అటువైపుగా వెళుతున్న ప్రయాణికులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఒరేయ్ బాబు. అది పాము రా.. వదిలేయ్ రా సామి అంటూ చాలామంది నాగరాజును హెచ్చరించారు. కానీ ఆయన వినలేదు. మద్యం మత్తులో ఎవరి మాటలను తలకెక్కించుకోలేదు. పొదల్లోకి వెళ్తున్న తాచుపామును మళ్లీ పట్టుకుని వచ్చి రోడ్డుపై ఆటలాడాడు. దీంతో ఆ తాచు పాముకు కూడా చివరకు ఓపిక నశించింది.. నాగరాజును కాటేసి పారిపోయింది. దీంతో స్థానికులు నాగరాజును వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తాచుపాముతో నాగరాజు పరాచకాలు ఆడుతున్న దృశ్యాలు స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. నాగరాజు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

* పాము పడగపై కొడితే
మద్యం మత్తులో మందుబాబులు చేసే అతి ఇలానే ఉంటుంది. పాము ఏం చేస్తున్నామో కూడా వారికి తెలియదు. సాధారణంగా పామును చూస్తే ఇట్టే భయపడతాం. కొన్ని పాములు పడగవిప్పితే దగ్గర ఉండేందుకు కూడా ఇష్టపడం. అటువంటిది నాగరాజు ఏకంగా ఆ పాము పడగపై చేయి వేస్తూ కొట్టినంత పని చేశాడు. కాలితో తన్నుతూ.. చేతితో కొడుతూ.. విష సర్పంతోనే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతని చర్యలను గమనించిన స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వారు తెగ భయపడిపోయారు.

* ఫ్రాంక్ వీడియో అనుకున్నారు
ఇటీవల ఫ్రాంక్ వీడియోస్ రాజ్యమేలుతున్నాయి. ఎక్కడికక్కడే యూట్యూబ్లో రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాంక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఎదురుగా పండగ విప్పిన పాము, దానిపై కొడుతున్న వ్యక్తి, మందు తాగినట్టు నటన.. ఇవన్నీ ఫ్రాంక్ వీడియోను తలపించినట్టు ఉన్నాయి. అందుకే స్థానికులు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ చివరకు నాగరాజు మద్యం మత్తులోనే అలా చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ పాము ఓపికకు కూడా అభినందించాల్సిందే. ఏకంగా అరగంట పాటు నాగరాజు చర్యలను ఓపికగా భరించింది. చివరకు కాటు వేసి పొదల్లోకి వెళ్లిపోయింది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version