Ind Vs Pak (2)
Ind Vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కు చాలా ప్రత్యేకమైంది. అతను తొలిసారిగా టీం ఇండియాపై కెప్టెన్ హోదాలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు తను టాస్ కూడా గెలిచాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తను టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు శుభాకాంక్షలు కూడా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ కోసం మహ్మద్ రిజ్వాన్ కాయిన్ విసిరాడు. అది అతనికి అనుకూలంగా వచ్చింది. దీని తర్వాత మహ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తరువాత రోహిత్ శర్మ రవిశాస్త్రితో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ సమయంలో రిజ్వాన్ రోహిత్ శర్మకు మ్యాచ్ శుభాకాంక్షలు తెలుపుతూ ‘గుడ్ లక్ భయ్యా’ అని చెప్పడం వినిపించింది. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మహ్మద్ రిజ్వాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్లు ఏమి అన్నారు?
పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేసింది. టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను ప్లేయింగ్ 11లో చేర్చారు. టాస్ గెలిచిన తర్వాత రిజ్వాన్ మాట్లాడుతూ.. “మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాము, ఇది మంచి పిచ్ లాగా కనిపిస్తోంది. మంచి లక్ష్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఐసిసి ఈవెంట్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే, మా ప్లేయర్లకు ఈ పరిస్థితి బాగా తెలుసు. గతంలో కూడా ఇక్కడ బాగా రాణించాం. ఈరోజు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాము. చివరి మ్యాచ్‌లో ఓడిపోయాం. కానీ ఈ సారి అలా ఉండదు. ’’ అన్నారు. టాస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇది పర్వాలేదు, వారు టాస్ గెలిచారు కాబట్టి మేము ముందుగా బౌలింగ్ చేస్తాము’ అని అన్నాడు. మంచి ప్లేయర్లు మాకు ఉన్నారని రోహిత్ శర్మ అన్నారు.
మ్యాచ్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ తో కూడా మాట్లాడారు. ఈ సమయంలో తను బాబర్ వీపును కూడా తట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ – ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిన్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
భారతదేశం – శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
Pakistan won the toss & Mohammad Rizwan has elected to bat first. #ChampionsTrophyOnJioStar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!
Start Watching FREE on JioHotstar pic.twitter.com/LeEwCLSmrW
— Star Sports (@StarSportsIndia) February 23, 2025
War gaya Babar #BabarAzam #PAKvINDpic.twitter.com/8SQ814D8p6
— Urooj Jawed (@uroojjawed12) February 23, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ind vs pak do you know what mohammad rizwan said to rohit sharma after winning the toss
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com