IND Vs NZ: 2020 సీజన్ లో టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 11 నుంచి స్వదేశం వేదికగా న్యూజిలాండ్ జట్టు తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐదు టి 20 మ్యాచ్ల సీరీస్ కూడా ఆడుతుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ కు ఇప్పటికే మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది.
మేనేజ్మెంట్ ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా ఉన్నాడు. అయితే అతడు గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడ్డాడు. ఆ తర్వాత కీలకమైన సిరీస్ లకు దూరమయ్యాడు. చాలా రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. కొద్దిరోజుల నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్(BCCI CoE) లోనే ఉంటున్నాడు.
న్యూజిలాండ్ తో జరిగే సిరీస్లో అయ్యర్ పేరు ప్రకటించినప్పటికీ.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి అతడికి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదు. దీంతో అతను ఆడేది అనుమానమేనని అందరూ అనుకున్నారు. అయితే సిరీస్ మరో నాలుగు రోజులు ప్రారంభమవుతుందనగా బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి గుడ్ న్యూస్ అనింది. శ్రేయస్ అయ్యర్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది.
అన్ని అనుకున్నట్లు జరిగితే అయ్యర్ న్యూజిలాండ్ జట్టుతో (IND vs NZ) తో జరిగే 3 వన్డేల సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడుతున్నప్పుడు అయ్యర్ అంతర్గత రక్తస్రావంతో ఇబ్బంది పడ్డాడు. ఉన్నట్టుండి మైదానం నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు ఆసుపత్రికి పరిమితమయ్యాడు. చాలా రోజులపాటు చికిత్స పొందిన అయ్యర్.. దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడిని న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేసింది. అతడి సామర్థ్యం కూడా బాగుందని మేనేజ్మెంట్ కు నివేదికలు అందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మంగళవారం నాటి మ్యాచ్లో ముంబై జట్టు సారధిగా అయ్యర్ విధానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న అతడు.. 82 పరుగులు చేశాడు.