Trivikram Srinivas : మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని తన కలం తో ఎన్నో సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చిన రచయిత త్రివిక్రమ్… ఆ తర్వాత దర్శకుడిగా మారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఆయన తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో గాని, జూనియర్ ఎన్టీఆర్ తో గాని చేయబోతున్నాడు అనే వార్తలైతే వచ్చాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాను వీళ్లిద్దరితో కాకుండా మరొక హీరోతో చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ను సంప్రదించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరితో ఒకరితోనే సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
దాంతో అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ మీద పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళిద్దరితో తనకు వర్క్ అవుట్ అవ్వదు అని నిర్ణయించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ను కలిసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక సూర్యతో తను ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.
సూర్య కి చెప్పిన కథ ‘గాడ్ ఆఫ్ వార్’ స్టోరీ ఒకటేనా? లేదంటే సూర్యతో మరో కొత్త స్టోరీ తో ముందుకు వెళ్తున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి… మొత్తానికైతే త్రివిక్రమ్ తను అనుకున్న రీతిలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆనందపరుస్తూ ఉంటాడు. అయితే అతని సినిమాలు కొంతవరకు కాపీ అనే కామెంట్స్ ని ఎదుర్కొన్నప్పటికి ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అతని సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు…
ముఖ్యంగా అతని సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలకి బ్రహ్మరథం పడుతూ ఉంటారు… ‘గుంటూరు కారం’ సినిమాతో ప్లాప్ చవి చూసిన ఆయన ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే ఒక సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…