IND Vs NZ Ishan Kishan: రాయ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల పై ఆధిపత్యం చూపించింది. నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి.. ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
209 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఆరు పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. భారీ అంచనాలతో మైదానంలోకి దిగిన అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ ఆరు పరుగులు చేసి వెను తిరిగాడు. ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చారు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మూడో వికెట్ కు ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అది కూడా 48 బంతుల్లోనే ఆ స్థాయిలో పరుగులు చేయడం విశేషం. ఫలితంగా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన నుంచి టీమిండియా పరిస్థితి 129/3 కి చేరుకుంది.. ఇషాన్ కిషన్(76) మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే కిషన్ అర్థ సెంచరీ చేయడం విశేషం.
కిషన్ ఫామ్ లోకి రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలపాటు జట్టుకు దూరంగా ఉండి.. ఊహించని విధంగా కిషన్ జట్టులో చోటు దక్కించుకోవడం వెనుక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే సీరియస్ కంటే ముందు.. సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీ జరిగింది.. ఈ ట్రోఫీలో కిషన్ జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అంతేకాదు ఆ జట్టును విజేతగా నిలిపాడు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు జట్టులో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న కిషన్.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన నేపథ్యంలో సెలెక్టర్లు అతనికి న్యూజిలాండ్ సిరీస్ లో అవకాశం కల్పించారు. అయితే తుది జట్టులో మాత్రం అతడిని తీసుకోలేదు. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కిషన్ కు మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. అయితే తొలి మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేసిన కిషన్.. రెండో మ్యాచ్లో దుమ్మురేపాడు. 32 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఏ బౌలర్ ని కూడా లెక్కపెట్టకుండా అతడు బ్యాటింగ్ చేయడంతో రాయ్ పూర్ మైదానంలో టీమిండి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.. ఫలితంగా న్యూజిలాండ్ విధించిన 209 రన్స్ టార్గెట్ కూడా టీమిండియా ముందు పూచిక పుల్లలాగా మారిపోయింది. కిషన్ కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (50*) కూడా తోడు కావడంతో టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించింది.