Ind Vs Nz Final 2025: ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు గాయాలు చేసింది న్యూజిలాండ్ జట్టు. ఈసారి కచ్చితంగా వాటికి లేపనం పూయాలని.. రివెంజ్ తీర్చుకోవాలని సగటు టీమిండియా క్రికెట్ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ పై విజయం సాధించాలని భావిస్తున్నాడు.
Also Read: ICC టోర్నీలలో టీమిండియా ఇన్నిసార్లు ఫైనల్ వెళ్ళింది.. ఐనా అతనొక్కడే సెంచరీ చేసింది..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ – భారత్ (IND vs NZ) ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు లీగ్ దశలో తలపడ్డాయి. తక్కువ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి అయిదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 2000 సంవత్సరం అక్టోబర్ 15న కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి పాలైంది. అప్పటిదాకా వరుస విజయాలు సాధించిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయింది. ఇక 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ భారత జట్టును ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇక ఇటీవల స్వదేశంలో భారత జట్టుతో మూడు టెస్టులకు మూడింటినీ గెలిచి న్యూజిలాండ్ సత్తా చాటింది. ఈ మూడు గాయాలు టీం ఇండియాను తీవ్రంగా దెబ్బతీశాయి. అందువల్లే వాటికి ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
వరుసగా మూడో ఫైనల్
టీమిండియా కు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడవ ఫైనల్. 2013లో భారత్ విజయం సాధించింది. 2017లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇక తాజా టోర్నీలో టీమిండియా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై వరుస విజయాలు సాధించింది. గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియను భారీ స్కోరు చేయనీయకుండా కట్టడి చేసింది. చివరికి విజయం సాధించింది.
న్యూజిలాండ్ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే..
న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటుతోంది.. లీగ్ దశలో భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రమే ఓటమిపాలైంది. నాకౌట్ టోర్నీలను పరిగణలోకి తీసుకుంటే 3-1 తేడాతో భారత జట్టుపై న్యూజిలాండే లీడ్ లో ఉంది. అందువల్ల టీం ఇండియా ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. న్యూజిలాండ్ జట్టులో స్పిన్ బౌలర్లు శాంట్నర్, బ్రేస్ వెల్, రచిన్ రవీంద్ర అదరగొడుతున్నారు. మీరు గనక జోరు చూపిస్తే టీమిండియా కు ఇబ్బంది తప్పదు. స్పిన్ బౌలింగ్ కు సహకరించే దుబాయ్ మైదానంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ గనుక టీమిండియా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రాహుల్, అయ్యర్, కులదీప్, వరుణ్ చక్రవర్తి, షమీ, హార్థిక్ పాండ్యా.
న్యూజిలాండ్: ఫిలిప్స్, మిచెల్, యంగ్, రచిన్ రవీంద్ర, షాంట్నర్(కెప్టెన్), జేమిషన్, ఓరూర్కి, హెన్రీ/ స్మిత్, విలియంసన్, లాథమ్.
Also Read: AI prediction: CT ఫైనల్ లో గెలిచేది ఎవరంటే?