Ind Vs nz 2nd T20 Ishan Kishan: రాయ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఐదు టి 20 మ్యాచ్ ల సిరీస్ లో 2-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 208 పరుగులు చేసినప్పటికీ.. భారత్ ఆ లక్ష్యాన్ని మరో 4.4 ఓవర్లు ఉండగానే ఫినిష్ చేసింది.
టీమిండియాలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (82*), ఇషాన్ కిషన్ (76) దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేశారు. శివం దుబే (36*) అదరగొట్టాడు. అభిషేక్ శర్మ (0), సంజు శాంసన్(6) విఫలమైనప్పటికీ.. ఇషాన్ కిషన్ .. సూర్య కుమార్ యాదవ్ దూకుడు వల్ల టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మూడో వికెట్ కు ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్ కు శివందుబే, సూర్య కుమార్ యాదవ్ అజేయంగా 81* పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఫలితంగా టీమ్ ఇండియా సూపర్ విక్టరీ అందుకుంది.
ఈ మ్యాచ్లో కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 32 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేశాడు. అయితే అతడి ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అంతేకాదు పౌల్క్స్ వేసిన మూడో ఓవర్ లో ఇషాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. అదనపు పరుగులతో కలిసి ఆ ఓవర్లో ఏకంగా 24 రన్స్ వచ్చాయి. ఈ ఓవర్ లో తొలి బంతి బౌండరీ లైన్ దాటింది. దీంతో ఎంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించాడు. ఆ తర్వాత బౌలర్ రెండు వైడ్లు వేశాడు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్ళింది. దీంతో ఒక బంతికే 11 పరుగులు (4+ నోబ్+ వైడ్+ వైడ్+ 4) వచ్చినట్టయింది. వాస్తవానికి ఇటువంటివి క్రికెట్ లో అత్యంత అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇది ఓవర్ తర్వాత టీమిండియా బ్యాటింగ్ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది.