DC Vs RR IPL 2025: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఆటలో వేగం వరకు.. మైదానంలో దూకుడు తనం ప్రదర్శించే వరకు యశస్వి జైస్వాల్ పర్వాలేదు. అయితే అతడి కంటే ఎన్నో ఏళ్ళు సీనియర్.. వయసులోనూ పెద్దవాడైన స్టార్క్ ను జైస్వాల్ టీజ్ చేశాడు. “నీ బంతిలో ఈ వేగం సరిపోదు.. అంతకుమించి కావాలి” అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్ట్ మాదిరిగా ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అంటే ఆస్ట్రేలియన్లకు ఒక్కసారి మండితే ఎలా ఉంటుందో జైస్వాల్ కు అర్థమైంది. ఆ తర్వాత వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. అలాగని ఇక్కడ టీమిండియా ఆటగాళ్ళను తక్కువ చేసి చూడటం మా ఉద్దేశం కాదు. కాకపోతే జైస్వాల్ అలా చేయడం వల్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రెస్టేజ్ గా తీసుకున్నారు.. టీమిండియా ఆటగాళ్లకు మిగతా టెస్ట్ మ్యాచ్ లలో గెలిచే అవకాశం ఇవ్వలేదు..
Also Read: సూపర్ ఓవర్ టై అయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు?
ఇన్నాళ్లకు లెజెండ్ గుర్తుకొచ్చాడు
బుధవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. సూపర్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ వెళ్ళింది. సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు బౌలర్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. రాజస్థాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.. ఇక అంతకుముందు కూడా స్టార్క్ మెరుపు వేగంతో బంతులు వేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్ లో కట్టుదిట్టంగా బంతులు వేశాడు. ఢిల్లీ జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కార వేడుకలో రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్క్ ను యశస్వి జైస్వాల్ కలిశాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత వీరిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడం ఇదే తొలిసారి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న తర్వాత స్టార్క్ ను యశస్వి జైస్వాల్ అభినందించాడు. ” వెల్ బౌల్డ్ లెజెండ్” అంటూ అభినందించాడు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇన్నాళ్లకు యశస్వి జైస్వాల్ కు స్టార్క్ లో వేగం తెలిసి వచ్చిందని.. అతడిలో ఉన్న లెజెండ్ కనిపించాడని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ” స్టార్క్ అద్భుతమైన బౌలర్. నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతని బౌలింగ్ లో వేగం లేదని యశస్వి జైస్వాల్ వ్యాఖ్యానించాడు . దానికి స్టార్క్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇప్పటికైనా స్టార్క్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ కు వేగం ఏమిటో అర్థమైంది అనుకుంటా.. అందువల్లే లెజెండ్ అని పిలిచాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: ఉమెన్ క్రికెటర్ స్మృతి మందానకు అరుదైన గౌరవం..
Jaiswal to Starc – “Legend, Very well bowled”.
– The Respect between the Legend & Future Legend pic.twitter.com/9vmgwe7tzo
— Johns. (@CricCrazyJohns) April 17, 2025