IND vs AUS: 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఉత్తమ ఫీల్డర్లకు టీమ్ మేనేజ్మెంట్ మెడల్స్ అందించడం మొదలుపెట్టింది. నాటి-20 ప్రపంచ కప్ లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్లకు లెజెండరీ ఆటగాళ్లతో మెడల్స్ అందించింది. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్తమ ఫీల్డింగ్ చేసిన ప్లేయర్లకు శిఖర్ ధావన్ ద్వారా మెడల్స్ అందించింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. అన్ని రంగాలలో ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 264 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ సులువుగా చేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేసిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత ఆరు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేదించింది.
Also Read : శ్రేయస్ అయ్యర్ త్రో కు వికెట్లు నేలకొరిగాయి.. బిత్తర పోయిన అలెక్స్ క్యారీ.. వైరల్ వీడియో
రవి శాస్త్రి మెడల్ అందించాడు
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మెడల్ అందుకున్నాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ల పురస్కారాలు అందుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి శ్రేయస్ అయ్యర్ మెడలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ వేశాడు. 61 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన అలెక్స్ క్యారీని శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో ద్వారా క్యారీని పెవిలియన్ చేర్చాడు. ఒకవేళ గనుక క్యారీ ని శ్రేయస్ అయ్యర్ రన్ అవుట్ చేయకుండా ఉండి ఉంటే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేది. దానిని ఛేదించడం టీమిండియాకు ఇబ్బందికరంగా ఉండేది. ఒకరకంగా శ్రేయస్ అయ్యర్ చేసిన పని వల్ల టీమిండియా ఆస్ట్రేలియాను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. తద్వారా ఆస్ట్రేలియాను 264 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఆరు వికెట్ల కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేదించింది. మొత్తంగా ఫైనల్ వెళ్ళిపోయింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ టీమిండియా ఫైనల్ వెళ్ళింది. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదే తీరుగా ఆడుతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించి ఫైనల్ వెళ్ళింది. ఆదివారం న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికా తో ఫైనల్ పోరులో తలపడనుంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది
Also Read : ఈసారి లెక్క తప్పలేదు.. 2023 నాటి ఓటమికి బదులు తీర్చుకున్నట్టే..
| | #INDvAUS
It was a battle of heavyweights
️And there was just one voice that “roared” in the dressing room to announce the winner #TeamIndia | #ChampionsTrophyhttps://t.co/lA6G3SRlG4
— BCCI (@BCCI) March 5, 2025