Game Changer
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల మూడేళ్ళ నిరీక్షణకు తెరదించుతూ విడుదలైన చిత్రమిది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. మొదటి నుండి తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను పూర్తి చేసే అలవాటు ఉన్న దిల్ రాజు, ఈ సినిమాకి డబ్బులు మంచి నీళ్లకు ఖర్చు చేసినట్టు చేసాడు. మొదటి రోజే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తే, ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. థియేటర్స్ లో ఎలాగో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కనీసం ఓటీటీ లో అయినా బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారు. బంపర్ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ మాత్రం వచ్చింది.
Also Read : గేమ్ చేంజర్’ తో మోసపోయాం..దిల్ రాజు మాకు డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టిస్టులు!
అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో హిందీ లో తప్ప అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. హిందీ థియేట్రికల్ రైట్స్ ఒప్పందం ప్రకారం, ఆరు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి. ఈ సినిమాని నాలుగు వారాలకే తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయాల్సి వచ్చింది. హిందీ ఆడియన్స్ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే హిందీ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయట్లేదట. ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ని జీ 5(Zee5) సంస్థకు దిల్ రాజు(Dil Raju) భారీ రేట్ కి అమ్మినట్టు తెలుస్తుంది. ఈ నెల 7వ తారీఖు నుండి ఈ సినిమా హిందీ వెర్షన్ జీ5 లో అందుబాటులోకి వస్తుందని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.
గత శనివారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జీ5 యాప్ లో విడుదల చేయగా, సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కేవలం 12 గంటల్లోనే ఈ సినిమాకి దాదాపుగా 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. #RRR కి మించిన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. జీ5 లో నార్త్ ఇండియన్స్ అత్యధికంగా ఉంటారు. రామ్ చరణ్ కి మొదటి నుండి బాలీవుడ్ వైపు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతీ సినిమాకి రికార్డు స్థాయి వ్యూస్ వస్తుంటాయి. మరి ‘గేమ్ చేంజర్; సినిమాకి కూడా బంపర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాదే విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
Also Reda : అమెజాన్ ప్రైమ్ లో ‘గేమ్ చేంజర్’ సెన్సేషనల్ రికార్డు..10 రోజుల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూస్తే ఆశ్చర్యపోతారు!