Rohit Sharma: టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. గత సీజన్లో టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. అయితే ఇందులో అతడు టి20 వరల్డ్ కప్ లో మాత్రమే విజయవంతమయ్యాడు.. మిగతా రెండు ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్ లేమీ తో ఇబ్బంది పడుతున్నాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేసే అతడు.. సింగిల్ రన్స్ కే పరిమితమైపోతున్నాడు. గంటలు గంటలు మైదానంలో నిలబడి ఆడిన అతడు.. నిమిషాలు కూడా ఉండలేక అవుట్ అయి వస్తున్నాడు. అందువల్లే అతడిని సిడ్ని టెస్ట్ కు దూరంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రెడ్ బాల్ ఫార్మాట్ క్రికెట్లో రోహిత్ శర్మకు తిరుగులేదు. కానీ ఎందుకనో అతడు తడబడుతున్నాడు. వరుస ఇన్నింగ్స్ లలో విఫలమవుతున్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ మార్చినప్పటికీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ లో టీమిండియా గెలిచింది. యశస్వి జైస్వాల్, రాహుల్ జోడి అదరగొట్టింది. దీంతో బ్రిస్ బేన్ టెస్ట్ వర్కు వారిని కొనసాగించారు. అయితే ఆరవ నెంబర్ లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్.. మళ్లీ విఫలమయ్యాడు. బంగ్లాదేశ్ సిరీస్ లో కొనసాగించినట్టుగానే.. ఇక్కడ కూడా అదే దారుణమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో అతడు మెల్ బోర్న్ టెస్టులో ఓపెనర్ గా వచ్చాడు. అతడి కోసం గిల్ ను పక్కన పెట్టారు. అయినప్పటికీ రోహిత్ తనను తాను నిరూపించుకోలేదు. మళ్లీ దారుణంగా అవుట్ అయ్యాడు.. ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో తలవంచాడు.. గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇక ఇప్పటివరకు అతడు మరో సెంచరీ చేయలేకపోయాడు. వరుస మ్యాచ్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. సూపర్బ్ నాక్ ఇన్నింగ్స్ ఆడే అతడు.. రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోతున్నాడు.. అందువల్లే అతడిని సిడ్నీ టెస్ట్ కు దూరంగా ఉంచారు. ఫామ్ లేకపోవడంతో రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. అయితే రోహిత్ ఇంగ్లాండ్ సీరీస్ తర్వాత ఒక సెంచరీ కూడా చేయలేకపోయాడు. కనీసం రెండు అంకెల పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అందువల్లే అతడిని సిడ్నీ టెస్ట్ కి దూరంగా ఉంచారు. జట్టుకు దూరంగా ఉండడంతో.. రోహిత్ అభిమానులు అతనికి బాసటగా నిలుస్తున్నారు.. టీం ఇండియా మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.