Ind Vs Aus 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం సిడ్నీ వేదికగా ఐదవ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో.. బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా కష్టాల్లో పడింది. 100 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఎప్పటిలాగానే రాహుల్ నిరాశపరిచాడు. యశస్వి జైస్వాల్ త్వరగానే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ నిర్లక్ష్య పూరితమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. గిల్ తన బాధ్యతా రాహిత్యాన్ని మరోసారి ప్రదర్శించుకున్నాడు. మొత్తంగా వరుసగా రెండు టెస్టులు ఓడిపోయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లకు బుద్ధి రాలేదు. కనీసం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంది అని తెలిసి కూడా.. వారి ఆట తీరులో మార్పు రాలేదు. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా ఆటగాడు రాహుల్ అవుట్ అయిన విధానం అతడి బాధ్యత రాహిత్యానికి పరాకాష్టగా నిలిచింది. టీమ్ ఇండియా స్కోరు 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. నాలుగో ఓవర్ ను స్టార్క్ వేస్తున్నాడు.. ఆ ఓవర్ లో వరుసగా ఐదు బంతులను స్టార్క్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. వాటిని జాగ్రత్తగా వదిలిపెట్టిన రాహుల్.. ఆరో బంతికి మాత్రం చిక్కిపోయాడు. ఆఫ్ స్టంప్ బంతులను రాహుల్ వదిలేయడంతో.. స్టార్క్ చివరి బంతిని లెగ్ సైడ్ దిశగా వేశాడు. దానిని తప్పుగా అంచనా వేసిన రాహుల్..షాట్ ఆడాడు. అది మిడ్ ఆఫ్ లో లేచి కోన్ స్టాస్ చేతిలో పడింది. దీంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది. 14 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
ఇన్నింగ్స్ కుదుపు
రాహుల్ అవుట్ అయిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ కుదుపునకు గురైంది . మెల్ బోర్న్ టెస్టులో 82, 84 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైపాల్.. సిడ్ని టెస్ట్ లో మాత్రం ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అతడు.. బోలాండ్ బౌలింగ్లో వెబ్ స్టర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 17 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ(17), గిల్(20) భారీ పరుగులు చేయకుండానే.. మధ్యలోనే బ్యాట్లు ఎత్తేయడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. దీంతో 100 పరుగుల లోపే టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రిషబ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నారు. రిషబ్ పంత్ 32, రవీంద్ర జడేజా 11 పరుగులు చేశారు.
Mis judgement by Kl Rahul #INDvsAUS pic.twitter.com/llpVZ4Joh5
— $achin Nayak (@SachinN18342436) January 3, 2025