Rohith Sharma : బీసీసీఐ తీసుకొచ్చిన 10 పాయింట్ల విధానంపై రకరకాల విమర్శలు.. కరకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక వీటిపై కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ విలేకరి నుంచి ప్రశ్న ఎదురయింది. దీనిపై అతడు ఒకింత ఘాటుగానే రిప్లై ఇచ్చాడు..” ఆ రూల్స్ గురించి మీకు ఎవరు చెప్పారు? బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు కదా.. అధికారికంగా విడుదలైన తర్వాత కచ్చితంగా దాని గురించి మాట్లాడదామని” రోహిత్ వ్యాఖ్యానించాడు. శనివారం ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ప్రకటించాడు. జట్టు ఆటగాళ్ల వివరాలను వెల్లడించిన తర్వాత రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ సుదీర్ఘంగా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఉద్దేశించి విలేకరి బీసీసీఐ గైడ్లైన్స్ గురించి ప్రశ్నించగా.. రోహిత్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ” ఆ నిబంధనల గురించి మీకు ఎవరైనా చెప్పారా? బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు కదా? అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత కచ్చితంగా మాట్లాడదాం. ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదు. అన్నిటిని నివృత్తి చేసే బాధ్యత నాది” అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు.. పది పాయింట్ల విషయంలో అజిత్ స్పష్టంగా మాట్లాడినప్పుడు.. రోహిత్ ఎందుకు ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడని సదరు విలేకరి కూడా తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.
ఆ నిబంధనలు విధిస్తే..
విలేకరుల సమావేశం అనంతరం కుటుంబాన్ని తీసుకెళ్లే విషయంలో ఆటగాళ్లపై నిబంధనలు విధిస్తే వారంతా నాకు ఫోన్ చేస్తారని.. ఆ ఇబ్బందిని తాను ఎదుర్కోలేనని రోహిత్ శర్మ సరదాగా నవ్వుకుంటూ విలేకరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ విలేకరులు కూడా నవ్వారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు 10 పాయింట్ల విషయంలో అజిత్ అగర్కర్ తనదైన శైలిలో మాట్లాడాడు. ఆటగాళ్లకు శిక్ష విధించడానికి ఇదేమి స్కూల్ కాదని.. అవి కేవలం నిబంధనలు మాత్రమేనని.. వాటికి అనుగుణంగా నడుచుకోవాలని ఆటగాళ్లకు చేసిన సూచనలు మాత్రమేనని అజిత్ పేర్కొన్నాడు. ” క్రికెట్లో విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి పోటీ ఎదుర్కోవాలంటే ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి.. ఇలాంటి నిబంధనలు అన్ని జట్లకు ఉంటాయి. ఇక ఇటీవల నిర్వహించిన సమీక్షలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి.. జట్టు ఎదుర్కొంటున్న వరుస ఓటముల పై చర్చ జరిగింది.. జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాం. టీం బాండింగ్ విషయంలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నాం.. దానికి ఆటగాళ్లు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆటగాళ్లు ఎవరైనా సరే ఆ నిబంధనలు పాటించాల్సిందే.. జట్టుకు ఎంతో ఉపయోగకరమైన వాటిని పాటిస్తేనే విజయాల సాధ్యమవుతాయి. ఆ విషయం ఆటగాళ్లకు కూడా తెలుసని” అజిత్ పేర్కొన్నాడు.
ऐसे आधिकारिक तौर पर झूठ बोला जाता है…. बीसीसीआई की बैंड बजाते खिलाड़ी
“Who told you about these rules. Has it come from the official handle of BCCI? Let it come officially”– Rohit Sharma on the latest BCCI Guidelines pic.twitter.com/xcOkLjjjUy
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) January 18, 2025