Ram Charan : గత కొంత కాలం నుండి దిల్ రాజుకి ఇండస్ట్రీ లో అసలు ఏమి కలిసి రావట్లేదు. ఒకప్పుడు వరుసగా సక్సెస్ లు అందుకుంటూ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఆయన, కరోనా లాక్ డౌన్ తర్వాత ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ ని చూశాడు. తన 50వ చిత్రం గా ‘గేమ్ చేంజర్’ కచ్చితంగా తన తల రాత మారుస్తుందని బలంగా నమ్మాడు. ప్రతీ సినిమాని మీడియం రేంజ్ బడ్జెట్ లో నిర్మించి, భారీ విజయాలను అందుకునే దిల్ రాజు, ఈ సినిమాకి మాత్రం శంకర్ మీద, రామ్ చరణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకం పెట్టి, డబ్బులు మంచి నీళ్లు లాగా ఖర్చు చేసాడు. కేవలం పాటల కోసమే ఆయన 75 కోట్లు ఖర్చు చేసాడంటే ఈ చిత్రం మీద ఎంత నమ్మకాలు పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా బడ్జెట్ తో పాటు ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ మొత్తం కలిపి దిల్ రాజు కి 450 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందట.
అంతే కాదు దాడి మీద వడ్డీలు కూడా భారీగా పడిందట. ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ తో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ పండితులకు సైతం మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. కానీ దిల్ రాజు కి ఈ చిత్రం ద్వారా మిగిలేది వంద కోట్ల రూపాయిలు మాత్రమే. గేమ్ చేంజర్ చిత్రం నుండి ఇప్పటి వరకు ఆయన జోబులోకి కేవలం వంద కోట్లు మాత్రమే వెళ్ళింది. ఓవరాల్ గా బ్యాలన్స్ షీట్ ని చూసుకుంటే దిల్ రాజు కి నష్టాలే మిగిలాయి. ఈ విషాయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దిల్ రాజు కి రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన నష్టానికి పరిహారంగా ఆయన కోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.
అది కూడా ఒక్క పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేస్తానని మాట ఇచ్చాడట. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక లాభాలు వస్తేనే అందులో కొంత డబ్బులు తీసుకుంటానని, అది కూడా ఒకవేళ కమర్షియల్ గా ఫ్లాప్ అయితే డబ్బులు తీసుకోనని చెప్పాడట. ఈ కాలం లో ఒక హీరో పైసా ఆశించకుండా ఇలాంటి వాగ్దానాలు చేయడం చిన్న విషయం కాదు. కమర్షియల్ యాడ్స్ కి కోట్ల కొద్దీ రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్న హీరోలు ఉన్న ఈ కాలం లో నిర్మాతల గురించి ఇంతలా ఆలోచించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్ తో చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతనే దిల్ రాజు తో చేసే అవకాశాలు ఉన్నాయి.