ICC : ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. చివరికి ట్రోఫీని దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే. వన్డేలలో వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో టీం ఇండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక ఆటగాళ్ల జాబితాలో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు టాప్ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా ఇతర దేశాల మాజీ ఆటగాళ్లకు కంటగింపుగా మారాయి. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను సైతం ఓడించి టీమ్ ఇండియా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న నేపథ్యంలో.. మాజీ ఆటగాళ్లకు కళ్ళు మండుతున్నాయి. అయితే టీం ఇండియా పై విమర్శలు చేస్తున్న మాజీ ఆటగాళ్లలో అనామకులు ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. దిగ్గజ ఆటగాళ్లు కూడా అదేవిధంగా నోరు పారేసుకోవడం ఇబ్బందికరంగా ఉంది.
Also Read : నిన్నేమో అడ్వాంటేజ్ అని కూశారు.. ఇప్పుడేమో షెడ్యూల్ అని వాగుతున్నారు..ఎవర్రా మీరంతా..
ఫేవర్ గా ఉంటోందట…
రోహిత్ శర్మ చెప్పినట్టు దుబాయ్ మైదానం ఒకటే.. కానీ దానిపై ఏర్పాటు చేసిన పిచ్ లు మాత్రం వేరు. అందువల్లే రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కు భిన్నమైన వ్యూహాన్ని రూపొందించాడు. ఆటగాళ్ల విషయంలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించాడు . అందువల్లే టీం ఇండియా ఆ స్థాయిలో విజయాలు సాధించింది . అయితే ఈ విషయాన్ని గుర్తించకుండా ఇతర దేశాల మాజీ ఆటగాళ్లు టీమిండియా పై నోరు పారేసుకుంటున్నారు. నీ జాబితాలోకి ఇప్పుడు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ అండి రాబర్ట్స్ చేరిపోయాడు. ” భారత్ జట్టుకు అనుకూలమైన విధానాలను ఐసీసీ తీసుకుంటున్నది. ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా ఆడిన మ్యాచులు మొత్తం ఒకే వేదికగా నిర్వహించారు. గత టి20 వరల్డ్ కప్ లోనూ ఇండియాకు ఫేవర్ గా ఐసీసీ నడుచుకుంది. సెమిస్ నిర్వహించే వేదిక టీమిండియా క్రికెటర్లకు ముందుగానే తెలిసింది. నా దృష్టిలో ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు. క్రికెట్ లో నో బాళ్లు, వైడ్లు ఉండకూడదని టీమిండియా కొడితే ఐసీసీ.. ఆ నిబంధనను కూడా తీసుకొస్తుందని” రాబర్ట్స్ విమర్శించాడు. రాబర్ట్స్ చేసిన విమర్శలు నేపథ్యంలో టీమిండియా అభిమానులు స్పందిస్తున్నారు. “భారత జట్టు పై విమర్శలు చేయడానికి నువ్వొక్కడివే తక్కువయ్యావ్.. టి20 వరల్డ్ కప్ జరిగింది వెస్టిండీస్ వేదికగా.. మరి వెస్టిండీస్ జట్టు ఎందుకు విజేతగా నిలవలేకపోయింది.. పాకిస్తాన్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది.. సొంత మైదానంలో పాకిస్తాన్ జట్టు ఎందుకు ఓడిపోయింది? వ్రతం చేయలేక మంగళవారం అన్నట్టుగా.. ఇలాంటి చవకబారు విమర్శలు చేస్తే దానికి ప్రతిస్పందన కూడా తీవ్రంగానే ఉంటుంది. అప్పుడు లెజెండరీ క్రికెటర్ అని కూడా మేము చూడమని” టీమిండి అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : రోహిత్ ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. అగ్రస్థానంలో గిల్..