Company : ఎవరైనా మోసం చేస్తే ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. ఇతడు కూడా అలానే దొరికిపోయాడు. కాకపోతే అతడు చేసిన మోసాన్ని చూసి అధికారులకు కూడా షాక్ కలిగింది. అతడు చేసిన విధానాన్ని చూసి దిగ్భ్రాంతి కలిగింది.. చివరికి అతడు చేసిన మోసాల చిట్టాను చూస్తే అధికారులకు మతి పోయినంత పని అయింది. చైనాలోని షాంగై ప్రాంతంలో పెరోల్ అనే పేరుతో లేబర్ సర్వీసెస్ అనే కంపెనీ ఏర్పాటయింది. ఈ కంపెనీకి హెచ్ఆర్ మేనేజర్ గా యాంగ్ పనిచేసేవాడు. అతడు ఎన్ని సంవత్సరాలలో 22 ఫేక్ ఎంప్లాయిస్ ను సృష్టించాడు. ఏకంగా 18 కోట్లను కొట్టేశాడు. ఉద్యోగుల నియామక విషయంలో అతడు ఇష్టానుసారంగా వ్యవహరించాడు. కంపెనీలో శాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడంతో.. దానిని అతడు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇందులో భాగంగా యాంగ్ ముందుగా సన్ పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. అందులో కంపెనీ జీతం వేయడంతో మిగతా కథను మొత్తం ఈజీగా నడిపించాడు.. చివరిగా ఒక రోజు యాంగ్ దొరికిపోయాడు.
Also Read : ఉద్యోగులకు రూ.4 లక్షల బోనస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్రాన్స్ కంపెనీ!
ఎలా దొరికిపోయాడు అంటే..
యాంగ్ సృష్టించిన సన్ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా విధుల్లోకి వస్తున్నాడు. ఇది కంపెనీ బాధ్యులకు అనుమానం కలిగింది. వెంటనే అతడి గురించి ఆరా తీస్తే.. అది ఫేక్ ఎకౌంట్ అని తెలింది. ఇలా ఎన్ని ఎకౌంట్లు ఉన్నాయో కంపెనీ యాజమాన్యం పరిశీలిస్తే.. మొత్తంగా 22 మంది ఫేక్ ఎంప్లాయిస్ అకౌంట్లో ఏర్పాటయ్యాయని.. ప్రతి నెల ఆ ఎకౌంట్లోకి జీతాలు వెళ్తున్నాయని కంపెనీ యాజమాన్యం గుర్తించింది. అయితే దీనిపై హెచ్ఆర్ మేనేజర్ యాంగ్ ను కంపెనీ యాజమాన్యం వివరణ కోరగా.. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగంలోకి దిగడంతో యాంగ్ మోసం బయటపడింది.. కంపెనీలో శాలరీ రివ్యూ సిస్టం లేకపోవడంతో యాంగ్ తనకు అనుకూలంగా అన్ని మలచుకున్నాడు. దాదాపు 18 కోట్లను కొట్టేశాడు. 8 సంవత్సరాల పాటు ఫేక్ ఎంప్లాయిస్ తో తన దందా కొనసాగించాడు. సాధారణంగా ఇలాంటి వ్యవహారం నడిపేటప్పుడు కంపెనీలో కొంతమంది సహకారాన్ని తీసుకుంటారు. కానీ యాంగ్ ఒక్కడే ఈ వ్యవహారాన్ని నడిపించాడు. దర్జాగా 18 కోట్లు తన జేబులో వేసుకున్నాడు.. అయితే యాంగ్ చేసిన మోసాన్ని వెలుగులోకి తీసుకురావడానికి అక్కడి అధికారులకు రోజుల తరబడి సమయం పట్టిందంటే.. అతడు ఎలా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. యాంగ్ మోసం చేసిన నేపథ్యంలో పేరోల్ కంపెనీ జాగ్రత్త పడింది. శాలరీ రివ్యూ సిస్టన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పని ఏదో ముందుగా చేసి ఉంటే ఆ సంస్థకు ఇంతలా నష్టం ఉండేది కాదు.
Also Read : ఐదు కోట్లు కొట్టేసిన పట్టించుకోని మేఘా కంపెనీ… చివరకు విషయం తెలిసి లబో దిబో