ICC Champions Trophy 2025
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2 ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. అయితే, రెండు జట్లు ఇప్పటికే టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్లో తమ ప్లేస్ కన్ఫాం చేసుకున్నాయి. మరోవైపు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గ్రూప్ బి నుండి సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు అభిమానులు సెమీఫైనల్లో టీం ఇండియా ఏ జట్టుతో తలపడుతుందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. చాలా మంది అభిమానులు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ గురించి చర్చించుకుంటున్నారు.
Also Read: బాబర్, రిజ్వాన్ ఔట్.. సీబీ ఝలక్.. న్యూజిలాండ్ టోర్నీకి యువ జట్టు
భారత జట్టు మార్చి 4న దుబాయ్‌లో తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇది టోర్నమెంట్ ప్రారంభంలో మొదటి సెమీ ఫైనల్ వేదిక ఖరారు అయింది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న లాహోర్‌లో జరుగుతుంది. దీని అర్థం దుబాయ్‌లో టీమ్ ఇండియా తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడటం ఖాయం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్?
ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడిస్తే, టీం ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారత్.. కివీస్ జట్టును ఓడిస్తే అది గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలుస్తుంది. గ్రూప్ A లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు సెమీఫైనల్లో గ్రూప్ B లో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది.
ఒకవేళ భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్స్ ఆడుతుంది.ఆదివారం మ్యాచ్‌లో టీం ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. భారత్ ఓడిపోతే గ్రూప్ Aలో రెండవ స్థానంలో నిలిచిపోతుంది. గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవలసి ఉంటుంది. టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంటే టైటిల్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. భారత జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించలేకపోతే టైటిల్ మ్యాచ్ పాకిస్తాన్‌లో జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే భారత్ న్యూజీలాండ్ తో గెలిస్తే ఆస్ట్రేలియాతో , సౌతాఫ్రికాతో తలపడనుందన్న మాట. అయితే సెమీస్‌లో ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఉంటేనే భారత్ కు మంచిదని క్రికెట్ ప్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇదే జరిగిందని, ఆ టోర్నీల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ కొట్టామని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు వస్తే ఆ జట్టును ఓడించడం చాలా కష్టమని అభిమానులు అంటున్నారు.