Pakistan (2)
Pakistan: చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ(ICC torny)కి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకుంది దాయాది దేశం పాకిస్తాన్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ–2025 టోర్నీ పాకిస్తాన్‌లో జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఇది ఆ దేశ క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు ఒక డిజాస్టర్(Dizastar)గా మారింది. టోర్నీలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించింది. ఇది ఆ దేశ క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఇక పాకిస్తాన్(Pakisthana) క్రికెట్ బోర్డు అయితే ఆటగాళ్లపై పట్టలేని కోపంగా ఉంది. టోర్నీ గెలవకపోయినా పర్వాలేదు కానీ, భారత్ చేతిలో ఓడిపోవడం పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు పాక్ అధ్యక్షుడు కూడా పాక్ జట్టు ఆట తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలో జరిగే టోర్నీలో జట్టులోని కొంత మందిని తప్పించాలని హుకుం జారీ చేశారు. దీంతో పీసీబీ(PCB) ఈమేరకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 2024 అక్టోబర్‌లో బాబర్ అజమ్‌ను వైట్–బాల్ కెప్టెన్సీ నుంచి తొలగించి, మహ్మద్ రిజ్వాన్(Mahmad Rizwan)ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నిర్ణయం బాబర్ అజమ్(Babar Azam)నాయకత్వంలో జట్టు ఇటీవలి ఐఇఇఐసీసీ టోర్నమెంట్‌లలో (ముఖ్యంగా ఖీ20 వరల్డ్ కప్ 2024లో) నిరాశపరిచిన ప్రదర్శనల తర్వాత వచ్చింది. రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల్లో వన్డే, టీ20ఐ సిరీస్‌లను ఆడనుంది.
Also Read: 300 మ్యాచ్‌కు సిద్ధమైన కింగ్ కోహ్లి.. కెరీర్‌లో మరో మైలురాయి.. సువర్ణాధ్యాయం!
షాకింగ్ నిర్ణయం..
పీసీబీ మరో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025లో పాకిస్తాన్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ (మార్చి 16 నుండి ప్రారంభం) కోసం డొమెస్టిక్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంలో బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చర్య 2026లో భారత్ మరియు శ్రీలంకలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును రీషేప్ చేసే ప్రయత్నంలో భాగంగా చూడవచ్చు. ఈ నిర్ణయాలు బాబర్ మరియు రిజ్వాన్ అభిమానులకు షాక్ ఇచ్చినప్పటికీ, పీసీబీ జట్టు పనితీరును మెరుగుపరచడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
అజామ్‌పై ఆరోపణలు..
మాజీ కెప్టెన్ బాబర్ అజాం ఫేవరిటిజం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తన స్నేహితులను జట్టులో ప్రాధ్యాత ఇచ్చి.. మెరిట్ ఉన్న ఆటగాళ్లను పక్కక పెట్టాడన్న విమర్శలు ఉన్నాయి. మాజీ క్రికెటర్ అహ్మద్ షహ్జాద్, జట్టు ఎంపికలో రాజకీయల హస్తాన్ని, స్నేహితుల ప్రాధాన్యతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జట్టు పునఃసంస్థాపన కోసం మెరిట్ ఆధారిత ఎంపికలను అమలు చేయడం అత్యంత అవసరం అని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో, బాబర్ అజాం పై ప్రధానంగా అతని ఫేవరిటిజం కారణంగా ఆరోపణలు కేంద్రబిందువుగా ఉన్నాయి.
రిజ్వాన్ పిరికివాడు.. బాబర్ పనికిరానివాడు’
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఓటమి తర్వాత రిజ్వాన్, బాబర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Danish Khaneria) స్పందించాడు. పాకిస్థాన్ జట్టులో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని కనేరియా మండిపడ్డాడు. బాబర్ అజమ్‌ను కోహ్లీతో పోల్చాడు. కానీ, బాబర్ చిన్న జట్లపై మాత్రమే పరుగులు చేస్తాడని తేల్చాడు. మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీని తప్పు పట్టాడు. ఏ బౌలర్‌ను ఎప్పుడు ఉపయోఇంచాలో రిజ్వాన్‌కు తెలియదని విమర్శించాడు.
Also Read: చాంపియన్స్ ట్రోఫీలో సెమీ చేరిన సౌత్ ఆఫ్రికా.. ఎవరికి చేటు?