Rajamouli And Mahesh Babu
Mahesh Babu And Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ని అప్లై చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కొంతమంది కమర్షియల్ సినిమాలను అద్భుతంగా చేస్తుంటే, మరి కొంతమంది మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. ఇక ఇంకొంతమంది మాత్రం ఎమోషనల్ సీన్స్ ను చాలా బాగా చేసి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్లందరి చేత శభాష్ అనిపించుకునేలా నటించి మెప్పిస్తుంటారు…
Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…
సూపర్ స్టార్ కృష్ణ(Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. సూపర్ స్టార్ రేంజ్ ను టచ్ చేయడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరసగా భారీ విజయాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయిన కూడా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. నిజానికి రాజమౌళి (Rajamouli) వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాజమౌళి పెట్టిన కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకున్న మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వీలైనంత తొందరగా ఈ సినిమాని ఫినిష్ చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి ఒకరు ఉండరు అనేది వాస్తవం… నటనలో ఆయన చాలా పరిణీతి ని చూపిస్తూ చాలా గొప్ప ఎమోషన్స్ ను పండించడమే కాకుండా ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించగలిగే ఎమోషన్ ని పండించే నటుడు కూడా తనే కావడం విశేషం…
ఇక ప్రస్తుతం ఆయన ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆయన తీసిన ఏ సినిమాలో కూడా ఆయన పెద్దగా కష్టం లేకుండా చాలా సున్నితమైన క్యారెక్టర్లను చేస్తూ ముందుకు సాగాడు. కానీ ఈ సినిమా కోసం తన మేకోవర్ దగ్గర నుంచి సినిమా షూటింగ్ లో డూప్ లేకుండా నటించే వరకు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటు ముందుకు సాగుతున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి మహేష్ తో నరకం అనే స్పెల్లింగ్ ని రాయిస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని మీమ్స్ సైతం వైరల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్కరి కల…అయితే అది అందరికీ సాధ్యమవ్వదు. కాబట్టి ఆయనతో సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఆయన చెప్పినట్టుగా చేస్తూ భారీ సక్సెస్ ని అందుకోవడానికి ఎంత కష్టమైనా సరే భరించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.
అందుకే రాజమౌళి ప్రతి హీరోకి కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని అప్లై చేస్తూ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటాడు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా అదే జరుగుతుంది అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు…
Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు