MI vs CSK : ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. 10 జట్లు ఆడుతున్నప్పటికీ, కొన్ని జట్లు మాత్రమే జోరు కొనసాగిస్తున్నాయి. కొన్ని జట్ల ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు బౌలర్లు వేస్తున్న బౌలింగ్ పై సోషల్ మీడియా లో దారుణంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లయితే ఏకిపారేస్తున్నారు. ఇదేం అటతీరంటూ దెప్పి పొడుస్తున్నారు. ఆ జాబితాలో హర్షా బోగ్లే కూడా ఉన్నాడు. కాకపోతే ఆయన చేసిన ఒక ట్వీట్ పెను దుమారాన్ని లేపింది. స్పోర్ట్స్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇటీవల చైన్నై జట్టు ముంబాయితో తలపడింది. ఈ సందర్భంగా చైన్నై బౌలింగ్ పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే తీవ్రంగా మండిపడ్డారు. హాట్ హాట్ కామెంట్స్ చేశారు.తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అవి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. వాటిని వెంటనే ఆయన డిలీట్ చేయడం విశేషం.
వాంఖడే మైదానం వేదికగా గత ఆదివారం ముంబాయి చైన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ సేన ముందుగా బ్యాటింగ్ చేసింది. చైన్నైఆటగాళ్లు ముంబాయి బౌలింగ్ ను ఓ ఆట ఆడుకున్నారు. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేశారు. ముఖ్యంగా హర్దిక్ పాండ్యా వేసిన చివరిలో ఓవర్ లో ధోని రెచ్చిపోయాడు. కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు. ధోని చేసిన ఆ 20 పరుగులే చెన్నై జట్టును గెలిపించడం విశేషం. ధోని హ్యాట్రిక్ సిక్స్ లతో విరుచుకుపడటంతో ఆ జట్టు ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ సమయంలో హర్షా భోగ్లే కామెంట్రీ చేస్తున్నాడు. “ఈ మైదానంపై 206 పరుగులు చేయడం మంచిదే. కానీ మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు ఇలాంటి మైదానంపై అదనంగా మరో 20 పరుగులు చేస్తే బాగుంటుంది. పైగా ఆ జట్టులో బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా లేవని” వ్యాఖ్యానించాడు.
హర్ష ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు శివరామకృష్ణన్ ఫైర్ అయ్యాడు. “మీలాంటి వాళ్లు చెన్నై జట్టును చులకన చేసేందుకు ఇష్టపడుతుంటారు. కాకపోతే అలాంటివి చెన్నై జట్టుతో కాకుండా నాతో చేయండి” అంటూ ఆయన ఘాటుగా పోస్ట్ పెట్టాడు. అంతటితోనే ఆగలేదు.. “ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది భారత క్రికెట్ కు నువ్వేమైనా చేశావా? అందులో నీ భాగస్వామ్యం ఏమైనా ఉందా?” అంటూ కామెంట్స్ చేశాడు. అనంతరం వాటిని శివరామకృష్ణన్ తొలగించాడు. అయితే అప్పటికే ఈ చర్చను కొంతమంది అభిమానులు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ముంబై పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో పతీరణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.