Homeక్రీడలుక్రికెట్‌India Semi Final Qualification: ‘చోకర్స్’ పుణ్యమా అని టీమిండియాకు దారి దొరికింది!

India Semi Final Qualification: ‘చోకర్స్’ పుణ్యమా అని టీమిండియాకు దారి దొరికింది!

India Semi Final Qualification: ఎప్పుడూ కీలక సమయంలో చేతులెత్తేసే దక్షిణాఫ్రికా, ఈసారి మాత్రం వెస్టిండీస్‌ను ఉతికి ఆరేసి మనకు “లైఫ్” ఇచ్చింది. సొంత గడ్డపై ఆడుతున్న విండీస్‌ను 16 ఓవర్లలోనే చిత్తు చేశారంటే.. మనోళ్లు ఇక “అమ్మయ్య! వాళ్లు ఓడిపోయారు కాబట్టి మనం గెలిచినట్టే” అని లెక్కలు వేసుకోవడం మొదలెట్టే ఉంటారు. జింబాబ్వే మీద కూడా టెన్షనేనా? పాపం.. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్ల గురించి ప్లాన్లు వేసేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. […]

India Semi Final Qualification: ఎప్పుడూ కీలక సమయంలో చేతులెత్తేసే దక్షిణాఫ్రికా, ఈసారి మాత్రం వెస్టిండీస్‌ను ఉతికి ఆరేసి మనకు “లైఫ్” ఇచ్చింది. సొంత గడ్డపై ఆడుతున్న విండీస్‌ను 16 ఓవర్లలోనే చిత్తు చేశారంటే.. మనోళ్లు ఇక “అమ్మయ్య! వాళ్లు ఓడిపోయారు కాబట్టి మనం గెలిచినట్టే” అని లెక్కలు వేసుకోవడం మొదలెట్టే ఉంటారు.

జింబాబ్వే మీద కూడా టెన్షనేనా?

పాపం.. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్ల గురించి ప్లాన్లు వేసేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జింబాబ్వే మీద గెలిస్తే చాలు సెమీస్‌కు వెళ్తాం అని ముహూర్తాలు చూసుకుంటున్నాం. నెట్ రన్‌రేట్ అనే కాలిక్యులేటర్ పట్టుకుని లెక్కలు వేయడంలో మనకు ఉన్న ప్రావీణ్యం మరే దేశానికి లేదు.

సమీకరణాల సిత్రాలు

ప్లాన్ A: రెండు మ్యాచ్‌లు గెలిస్తే హీరోలం.
ప్లాన్ B: ఒకవేళ జింబాబ్వే చేతిలో పొరపాటున (మనకు అలవాటేగా!) తడబడితే.. మళ్ళీ దక్షిణాఫ్రికా కాళ్లు పట్టుకోవాలి. “ప్లీజ్ బాబూ.. జింబాబ్వేను ఓడించేయండి” అని ప్రార్థనలు చేయాలి.

పాయింట్ల పట్టిక.. పరమార్థం

దక్షిణాఫ్రికా ఏమో 4 పాయింట్లతో రాజసం చూపిస్తోంది. వెస్టిండీస్ ఓడినా రెండో ప్లేస్‌లో ఉంది. మనమేమో ఇంకా ‘సున్నా’ దగ్గరే ఉండి.. “మా రూటే సెపరేటు.. చివరి నిమిషం వరకు ఉత్కంఠ ఉంటేనే మాకు కిక్కు” అన్నట్టు వెయిట్ చేస్తున్నాం.

పక్కవాడు ఫెయిల్ అయితే మనం పాస్ అయినట్టు ఫీలవ్వడం కంటే.. మన బ్యాటర్లు కాస్త క్రీజులో నిలబడి, బౌలర్లు వైడ్లు వేయకుండా ఉంటే ఈ ‘క్యాలిక్యులేటర్’ కష్టాలు మనకు ఉండవు కదా సామీ!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper