Pakistan fan outburst viral video: వామ్మో ఏం కోపం.. ఎంత ఆగ్రహం.. అరచి అరచి పోయేలా ఉన్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. కనిపిస్తే కొడతాడేమో.. అవసరమైతే ఇంకా ఏదైనా చేస్తాడేమో.. అంతలా ఉంది అతడి ఆగ్రహం. మామూలుగా కాదు.. పళ్ళు కొరుకుతున్నాడు. పిడికిళ్ళు బిగిస్తున్నాడు. మీది మీదికి వస్తున్నాడు.. అసలేం చేసావో చెప్పు. ఎందుకిలా చేశావో చెప్పు అంటూ దునుమాడుతున్నాడు.
ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో భాగంగా పాకిస్తాన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభంలో పాకిస్తాన్ జట్టు దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేసింది. తొలిపది ఓవర్ల వరకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా అదరగొట్టింది. బీభత్సంగా బ్యాటింగ్ పరుగుల వరద పారించింది. ఎప్పుడైతే టీమిండియా బౌలింగ్ స్టైల్ మారిందో.. అప్పటినుంచి పాకిస్తాన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ జట్టు ఆటగాళ్లు వెంట వెంటనే పేవిలియన్ చేరుకోవడంతో చూస్తుండగానే కుప్పకూలిపోయింది.. భారత జట్టు ఎదుట ఒక మోస్తరు టార్గెట్ విధించినప్పటికీ.. దూకుడుగానే బౌలింగ్ చేసింది పాకిస్తాన్ జట్టు. 20 పరుగులకే మూడు వికెట్లు తీసి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది.
ఈ దశలో తిలక్ వర్మ టీమిండియా పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. కష్టకాలంలో జట్టుకు అండగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్, శివం దుబే తో కలిసి కీలక ఇన్నింగ్స్ నిర్మించాడు. తద్వారా టీం మీడియాను గెలిపించాడు. అయితే భారత ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ రౌఫ్ వేశాడు. అతని బౌలింగ్లో తిలక్ వర్మ ఊచకోత కోశాడు. బీభత్సంగా పరుగులు తీశాడు. రౌఫ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాల్సిన చోట.. తేలిపోవడంతో పాకిస్తాన్ ఓడిపోవలసి వచ్చింది. పాకిస్తాన్ ఓటమికి అతడే ప్రధాన కారణమని ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ ప్లేయర్లు కూడా అలాగే మాట్లాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశానికి చెందిన యూట్యూబర్ రౌఫ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. “ఒరేయ్ కుక్క.. నువ్వు అలా ఎందుకు బౌలింగ్ చేసావ్.. అలా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. టీమిండియాను గెలిపించడానికి నువ్వు అలా చేశావు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
A Pakistani Youtuber got frustrated and started hammering Haris Rauf
He says – “Haris Rauf was playing for India and was the 12th man of India”
From Virat Kohli to Abhishek Sharma to Tilak Varma, that’s the career story of Haris
A must watch video #INDvsPAK pic.twitter.com/9bzhssVoY4
— Richard Kettleborough (@RichKettle07) September 29, 2025