Hardik Pandya Girlfriend : దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను చూడటానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు, చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. హార్దిక్ పాండ్యా, అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వాలియా కూడా వచ్చారు. ఇటీవల కాలంలో జాస్మిన్ పేరు ముఖ్యాంశాలలో ఉన్న సంగతి తెలిసిందే. నటాషా స్టాంకోవిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ జాస్మిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇద్దరి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా అనౌన్స్ మెంట్ అయితే లేదు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో మరెవరిదో కాదు జాస్మిన్ వాలియాది. ఆమెది, హార్దిక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జాస్మిన్ వాలియా మొదట భారతీయురాలు.. కానీ తర్వాత ఆమె ఇంగ్లండ్ లో సెటిల్ అయ్యారు. జాస్మిన్ వృత్తిరీత్యా సింగర్, టీవీ ప్రపంచంలో ఆమెకు చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఒకే సమయంలో గ్రీస్‌లో హాలీడే గడుపుతున్నట్లు కొన్ని ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత వారి మధ్య ఏదో ఉందని పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. వారిద్దరు కలిసి ఉన్నట్లు ఫోటో ఏదీ కనిపించలేదు కానీ వారిద్దరూ ఒకే సమయంలో.. ఒకే స్థలంలో కనిపించినందున ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
హార్దిక్ పాండ్యా 2020 సంవత్సరంలో సెర్బియన్ నర్తకి, నటి నటాషా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ బంధంతో వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అగస్త్య. కానీ 2024 సంవత్సరంలో వారు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇద్దరూ జూలై 2024లో విడిపోతున్నట్లు కన్ఫాం చేశారు.
Hardik Pandya’s well-wisher and supporter Jasmin Walia in the match
Friends forever ❤️ pic.twitter.com/RYzKM6RxLH
— Nenu (@Nenu_yedavani) February 23, 2025