https://oktelugu.com/

Samantha: నాగ చైతన్య కాదు సమంత ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? అతనితో రెండేళ్ల ప్రయాణం అలా ముగిసింది!

హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్థలతో ఈ లవ్లీ కపుల్ విడిపోయారు. అయితే సమంత ఫస్ట్ లవ్ నాగ చైతన్య కాదట. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. తన ఫస్ట్ లవ్ ఎవరో కూడా ఆమె చెప్పారు.

Written By: , Updated On : February 24, 2025 / 09:11 AM IST
Samantha

Samantha

Follow us on

Samantha: సమంత చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తీరు అద్భుతం. అలాగే సమంత చాలా స్ట్రాంగ్ ఉమన్. స్వతంత్ర్య భావాలు కలిగిన అమ్మాయి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. 2010లో సమంత నట ప్రస్థానం మొదలైంది. ఏమాయ చేసావే ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యను సమంత ప్రేమించింది.

కొన్నేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. దాదాపు నాలుగేళ్లు అన్యోన్యంగా జీవించిన నాగ చైతన్య-సమంత.. మనస్పర్థలతో విడిడిపోయారు. వారి విడాకులకు కారణం ఏమిటనేది తెలియదు. కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా సమంత ఆరోపణలు ఎదుర్కొంది. సమంత ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. కెరీర్లో ముందుకు సాగుతూ, తానేంటో నిరూపించుకుంటుంది.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. నాగ చైతన్య సమంత ఫస్ట్ లవ్ కాదట. ఈ విషయాన్ని గతంలో సమంత ఓ సందర్భంలో వెల్లడించారు. సమంత మాట్లాడుతూ.. ఇంటర్ చదివే రోజుల్లో ఒక అబ్బాయి తనను రోజూ ఫాలో అయ్యేవాడట. తన కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేసేవాడట. సమంతతో పాటు బస్ ఎక్కి కాలేజ్ వద్ద దిగేవాడట. కాలేజ్ లోపలికి వెళ్లే వరకు ఆమె వెనకాలే నడిచేవాడట. కానీ మాట్లాడే ప్రయత్నం చేసేవాడు కాదట.

ఒక రోజు సమంత ధైర్యం చేసి.. ఆగి ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నావు? అని అడిగిందట. నేను నిన్నేం ఫాలో కావడం లేదని ఆ అబ్బాయి సమాధానం చెప్పడంతో సమంత షాక్ అయ్యిందట. దాదాపు రెండేళ్లు ఆ కుర్రాడు సమంత వెనకాల తిరిగాడట. సమంతకు కూడా ఆ కుర్రాడు అంటే ఇష్టం అట. కానీ అతడు తన ప్రేమ చెప్పలేదట. ఇంటర్ అయ్యాక తనకు ఆ అబ్బాయి కనిపించలేదని సమంత చెప్పుకొచ్చింది.

ఇక సమంత కెరీర్ గురించి మాట్లాడితే.. ఆమె సినిమాలు తగ్గించారు. సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలైంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత నటిస్తున్నారని, త్వరలో స్ట్రీమింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. సొంత బ్యానర్ ఏర్పాటు చేసిన సమంత.. మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక మూవీ ప్రకటించింది.