Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయి ని పెంచిన దర్శకుడు మాత్రం రాజమౌళినే… ఆయన లాంటి దర్శకుడు ఇండియాలో మరొకరు ఉండరనేది వాస్తవం. ఆయన ఒక సినిమా కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు… అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే దక్కుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అన్ని చాలా గొప్ప సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేకి పెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నింటితో కూడా మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించాలంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన అవసరమైతే ఉంది. మరి దాని కోసమే రాజమౌళి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో ఆయన స్టార్ డమ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది కాబట్టి అంతకుమించి తను కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకి చెప్పని రాజమౌళి ఈ సినిమాలో హాలీవుడ్ హీరోని కూడా తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ప్రముఖ రెజ్లర్ గా పేరు తెచ్చుకున్న ‘ది రాక్’ (The Rock) హీరోగా హాలీవుడ్ లో పలు సినిమాలు వచ్చాయి. ఇక హాలీవుడ్ లో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక అతని చేత ఈ సినిమాలో ఒక గెస్ట్ అప్పిరియన్స్ పాత్రను వేయించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగాత్మకమైన సినిమాలో కూడా తను భాగం అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఆయన పాత్ర ఏంటి ఆయన ఎంత సేపు సినిమాలో కనిపిస్తాడు. తద్వారా ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి గుర్తింపును ఇవ్వబోతుందనేది కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రాజమౌళి ఈ విషయం మీద స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఇక దీంతో పాటుగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.
సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుంది. ఇలాంటి విషయాలను రాజమౌళి తొందర్లోనే తెలియజేయాలని చూస్తున్నాడట…చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి తను అనుకున్న సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది…ఒకవేళ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నత స్థానం లో నిలుస్తుంది…