Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్ కోట్ వేదికగా విదర్భ, బరోడా జట్లు పోటీ పడుతున్నాయి. బరోడా జట్టు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది . నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగులు చేసింది. బరోడా జట్టు తరుపున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు . ఆడుతోంది వన్డే మ్యాచ్ అని మర్చిపోయి.. టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. బ్యాటింగ్ కు దిగే హార్దిక్ పాండ్యా.. తన దూకుడుతో వేగంగా పరుగులు తీస్తాడు. శనివారం విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే స్థాయిలో విదర్భ పై కూడా రెచ్చిపోయాడు. సూపర్ ఫామ్ లో ఉన్న హార్థిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.
హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చే సమయానికి బరోడా జట్టు 5 వికెట్ల కోల్పోయి 71 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో జట్టును ఆదుకోవడానికి హార్దిక్ పాండ్యా మొదట్లో నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. సింగిల్స్, బౌండరీలు, సిక్సర్లతో విధ్వంసం మొదలుపెట్టాడు. బరోడా ఇన్నింగ్స్ 39 ఓవర్ లో 6,6,6,6,6,4 పరుగులు చేశాడు. కేవలం ఆరు బంతుల్లోనే 34 పరుగులు చేసి.. తన సుడిగాలి ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో విదర్భ జట్టు బౌలర్లకు రుచి చూపించాడు. 92 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా 133 పరుగులు చేశాడు. 144.57 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. బరోడా జట్టులో ఇతర ప్లేయర్లు అంత గొప్పగా ఆకట్టుకోలేకపోయారు. ఏ బ్యాటర్ కూడా 30 కి మించి పరుగులు చేయలేకపోయారు.
విదర్భ బౌలర్లు మొదట్లో కట్టుదిట్టంగా బంతులు వేశారు. వికెట్లు కూడా తీశారు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఒకసారి గా విదర్భ బౌలర్లు డిఫెన్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. తద్వారా బరోడా జట్టు స్కోరును 293 పరుగులు దాకా తీసుకెళ్లాడు. విదర్భజట్టు లో యాష్ ఠాగూర్ నాలుగు టికెట్లు పడగొట్టాడు.
హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా జుట్టుతో జరిగిన చివరి t20 మ్యాచ్లో సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. అతడి భీకరమైన ఇన్నింగ్స్ వల్ల భారత్ 231 పరుగులు చేసింది. బ్యాటింగ్ పరంగానే కాకుండా బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా సంచలనాలు సృష్టిస్తున్నాడు. టి20 ఫార్మేట్ లో వేగంగా 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న మూడవ భారతీయ బౌలర్ గా పాండ్యా అవతరించాడు.