Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Trailer Review: 'ధురంధర్ 2 - ది రివెంజ్' ట్రైలర్ రివ్యూ :...

Dhurandhar 2 Trailer Review: ‘ధురంధర్ 2 – ది రివెంజ్’ ట్రైలర్ రివ్యూ : యాక్షన్ ఉంది.. కానీ ఎమోషన్ ఎక్కడ?

Dhurandhar 2 Trailer Review: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ధురంధర్ 2 : ది రివెంజ్ ‘(Dhurandhar 2 : The Revenge) మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలను , రీజినల్ సినిమాలను వణికించిన ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ కోసం మన తెలుగు ఆడియన్స్ స్టార్ హీరో మూవీ ట్రైలర్ కోసం ఎలా ఎదురు చూసారో, అలా ఎదురు చూసారు. అలా […]

Dhurandhar 2 Trailer Review: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ధురంధర్ 2 : ది రివెంజ్ ‘(Dhurandhar 2 : The Revenge) మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలను , రీజినల్ సినిమాలను వణికించిన ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ కోసం మన తెలుగు ఆడియన్స్ స్టార్ హీరో మూవీ ట్రైలర్ కోసం ఎలా ఎదురు చూసారో, అలా ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది చూద్దాం. ఇండియా లో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ కి కారణమైన ISI గ్యాంగ్ మీద రివెంజ్ తీర్చుకునే పాత్రలో ఇందులో హీరో కనిపిస్తాడు. వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన రెహమాన్ డెకాయిట్ ని చంపడంతో ‘ధురంధర్ ‘ మూవీ ముగుస్తుంది. అయితే ల్యారీ ప్రజలు రెహమాన్ డెకాయిట్ ని ఒక దేవుడిలాగా చూస్తారు.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ?, అనేది ట్రైలర్ ఆరంభం లోనే కొన్ని విజువల్స్ చూపించారు. ముందుగా మొదటి భాగం లోని కొన్ని షాట్స్ చూపించారు. అయితే ఉరి శిక్ష కి దగ్గరగా ఉన్న కొంత మంది ఖైదీలను గూడాచారులుగా పాకిస్థాన్ కి పంపుతూ, అక్కడి రహస్యాలను చెందించే ఆపరేషనే ‘ధురంధర్ ‘ అని మనకి ఆ సినిమా క్లైమాక్స్ లో మాధవన్ చెప్పే సంగతి అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ లో గూఢచారి గా ఉన్నప్పుడు హీరో రణవీర్ సింగ్ పేరు హంజా అలీ మజారీ. కానీ ఆయన అసలు పేరు మాత్రం ‘జస్ కిరాత్ సింగ్ రంగీ’. అతని ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ ట్రైలర్ ని చూస్తేనే తెలుస్తోంది. ఉరి శిక్ష పడే స్థాయిలో ఆయన ఏమి నేరాలు చేసి ఉంటాడు అనేది ఈ సినిమాలో ఒక కోర్ పాయింట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ లో టెర్రరిస్ట్ మాదిరిగా హీరో అందరినీ కాల్చుకుంటూ వెళ్తుంటాడు. ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనేది కూడా ఆసక్తికరమైన పాయింట్ అనుకోవచ్చు. ఇంతకు మించి ఈ ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమి లేవు. చాలా ల్యాగ్ చేసినట్టు అనిపించింది, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా ఆకర్షణీయంగా లేదు. చాలా పెద్ద మైనస్ అయ్యింది అనే చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ మొత్తం యాక్షన్ పార్ట్ మాత్రమే ఉంది, ఎమోషన్ లేదు, అంతే కాకుండా ఈ ట్రైలర్ లో రెహమాన్ డెకాయిట్ పాత్ర లేని లోటు బాగా కనిపించింది. సోషల్ మీడియా లో సంచలనంగా మారిన ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper