Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Movie Interval Twist: 'ధురంధర్ 2 ' చిత్రంలో హీరోకి ఆ పాత్ర...

Dhurandhar 2 Movie Interval Twist: ‘ధురంధర్ 2 ‘ చిత్రంలో హీరోకి ఆ పాత్ర వెన్నుపోటు పొడవనుందా? ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది!

Dhurandhar 2 Movie Interval Twist: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ధురంధర్ 2 ‘ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయగా , ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీ తో పాటు, అన్ని భాషల్లోనూ ఈ ట్రైలర్ ని విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. కానీ కేవలం హిందీ లో మాత్రమే విడుదలైంది. మిగిలిన వెర్షన్స్ కి డబ్బింగ్ పూర్తి కాలేదని […]

Dhurandhar 2 Movie Interval Twist: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ధురంధర్ 2 ‘ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయగా , ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీ తో పాటు, అన్ని భాషల్లోనూ ఈ ట్రైలర్ ని విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. కానీ కేవలం హిందీ లో మాత్రమే విడుదలైంది. మిగిలిన వెర్షన్స్ కి డబ్బింగ్ పూర్తి కాలేదని సమాచారం. అయితే ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో కేవలం హింస తప్ప, ఏమి లేదని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి భాగం లో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చిన సన్నివేశాలు ఉన్నాయని, కానీ రెండవ భాగం లో ఆ రేంజ్ సీన్స్ ఉన్నట్లుగా అనిపించలేదని అంటున్నారు.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ఒక పాత్ర హీరోకి చాలా పెద్ద వెన్నుపోటు పొడవబోతుందని , ఇంటర్వెల్ ట్విస్ట్ అదేనని అంటున్నారు. ఆ పాత్ర మరెవరో కాదు, హీరోయిన్ . ‘ధురంధర్’ చిత్రంలో హీరోని ఎంతో గాఢంగా ప్రేమించే పాత్రలో కనిపించింది హీరోయిన్ సారా అర్జున్. కానీ ఆమె తన తండ్రిని కాపాడుకోవడం కోసమే హీరోతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తుందని తెలుస్తోంది. ఇందులో హీరో తన లక్ష్యానికి అడ్డు వచ్చే ప్రతీ ఒక్కరిని చంపుకుంటూ వెళ్లే రకం. రెహ్మాన్ డెకాయిట్ ని కూడా అందుకే చంపాడు. ఎదో ఒక రోజు తన తండ్రిని చంపే రోజు కూడా ఒకటి వస్తుంది . అందుకే సేఫ్ గా ఆమెని అతని తండ్రే హీరో కి దగ్గరయ్యేలా చేసాడని విశేల్షకులు అంటున్నారు. ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో హీరోయిన్ గన్ పట్టుకొని ఉంటుంది చూసారా ?, అక్కడే ఈ కీలక ట్విస్ట్ రివీల్ అవుతుందట.

మరి ఈ ట్విస్ట్ ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రం లో రెహమాన్ డెకాయిట్ పాత్ర కనీసం ఫ్లాష్ బ్యాక్ లో కూడా కనిపించేలా లేదు. మొదటి పార్ట్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రెహమాన్ డెకాయిట్ పాత్రనే. కానీ రెండవ భాగం లో ఆ పాత్రనే లేదని తెలుస్తోంది. ఇది సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నేడు ఉదయం మొదలయ్యాయి. విడుదల తేదికంటే ముందు, అనగా మార్చి 18 న ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా ప్రీమియర్ షోస్ పడనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper