Homeఎంటర్టైన్మెంట్Telugu Directors: ఈ దర్శకుల పరిస్థితి ఏంటి..? సినిమా సినిమాకి ఇంత గ్యాప్ అవసరమా..?

Telugu Directors: ఈ దర్శకుల పరిస్థితి ఏంటి..? సినిమా సినిమాకి ఇంత గ్యాప్ అవసరమా..?

Telugu Directors: సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక సినిమాతో సక్సెస్ ని సాధించి స్టార్ డమ్ ను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు టాప్ డైరెక్టర్లుగా ఎదుగుతారు. నిజానికి కొంతమంది దర్శకులు స్టార్ హీరోలను డైరెక్షన్ చేసినప్పటికి వాళ్లకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికి తను టాప్ డైరెక్టర్ గా ఎదగలేకపోతున్నాడు. […]

Telugu Directors: సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక సినిమాతో సక్సెస్ ని సాధించి స్టార్ డమ్ ను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు టాప్ డైరెక్టర్లుగా ఎదుగుతారు. నిజానికి కొంతమంది దర్శకులు స్టార్ హీరోలను డైరెక్షన్ చేసినప్పటికి వాళ్లకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికి తను టాప్ డైరెక్టర్ గా ఎదగలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాలు సక్సెస్ ని సాధిస్తున్నాయి తప్ప సూపర్ సక్సెస్ గా మారడం లేదు. ఇక చివరగా ఆయన చేసిన ‘వారసుడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక తను సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కూడా అతనికి చాలా మైనస్ అవుతుంది…దానివల్ల ఆ దర్శకుడిని ఎవరు గుర్తుంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. మినిమం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయాలి.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

వారసుడు సినిమా వచ్చి ఆల్రెడీ మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. 2007లో మున్నా సినిమాతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ఆరు సినిమాలు మాత్రమే చేశాడు. తన కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది అయినప్పటికి కేవలం ఆరు సినిమాలో చేయడం పట్ల అతని అభిమానులు సైతం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…

స్టార్ హీరోల కోసం ఎదురుచూడడం కంటే దొరికిన హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం మంచిదని పలువురు సినిమా మేధావులు కూడా చెబుతున్నారు. పూరి జగన్నాథ్ గతంలో అలాగే చేసేవాడు స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే వేరే హీరోతో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించేవాడు. దర్శకుడి దగ్గర దమ్మున్నప్పుడు హీరో ఎవరనేది మ్యాటర్ కాదు. దాన్ని అతను ఎలా డీల్ చేశాడు అనేది మ్యాటర్…

సురేందర్ రెడ్డి సైతం ఈ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇక రాజమౌళి సినిమాలకు 3 నుంచి 4 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికి తన సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితైతే ఏర్పడుతుంది. ఆయన సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఆయన తీసుకున్న టైమ్ గురించి ఆలోచించరు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper