Hardik Pandya: హార్దిక్ పాండ్యా గత ఐపిఎల్ సీజన్ నుంచి ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో అతడు విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతకుముందు సీజన్లో గుజరాత్ జట్టుకు అతడు నాయకత్వం వహించాడు. 2022 సీజన్లో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. 2023 సీజన్లోనూ గుజరాత్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో చెన్నై చేతిలో గుజరాత్ ఓడిపోయింది. ఇక ఆ తర్వాతి సీజన్లో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు కెప్టెన్ గా నియమించింది. అప్పటిదాకా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను సీనియర్ ఆటగాడి హోదాకు మాత్రమే పరిమితం చేసింది. దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై విపరీతమైన విమర్శలు వచ్చినప్పటికీ.. హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం అండగా నిలిచింది. గత సీజన్ల ముంబై జట్టు ఊహించిన గొప్పగా.. ఆశించినంత స్థాయిలో ఆడ లేకపోయింది. గ్రూపు దశ నుంచి ఇంటికి వచ్చింది.
ఈ సీజన్లో నెంబర్ వన్
ఈ సీజన్ లో ముంబై జట్టు ప్రారంభంలో వరుసగా ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించడం మొదలుపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విజయాలతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేసింది. గుజరాత్ జట్టును పక్కన పెట్టింది. బెంగళూరు జట్టును వెనక్కి తోసేసింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను బలోపేతం చేసుకుంది. ఇక ముంబై జట్టు గురువారం రాజస్థాన్ తో తలపడింది.. ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు సెంచరీ రన్స్ తేడాతో విక్టరీ సొంతం చేసుకుంది. ఇక రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన ఎడమ కంటికి పైన టేప్ అంటించుకుని కనిపించాడు. ప్రత్యేకమైన కళ్ళజోడు కూడా ధరించాడు. ప్రాక్టీస్ సెషన్లో అతడు పాల్గొనగా బంతి బలంగా తగిలింది. దీంతో ఏడు కుట్లు పడ్డాయి. అయితే అంతటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అతడు మ్యాచ్ ఆడాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ 48 రన్స్ చేశాడు. ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు. ” హార్దిక్ జట్టు కోసం మాత్రమే ఆడతాడు. కొన్ని సందర్భాల్లో అతడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అతడు ఏంటనేది ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి తెలుసు. అందువల్లే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధించింది. ఏకంగా టేబుల్ టాపర్ గా అవతరించింది. అందుకే ముంబై ఇండియన్స్ ఈసారి టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ముంబై కనుక ఇదే జోరు చూపిస్తే ఆరోసారి కచ్చితంగా ట్రోఫీని అందుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. హార్దిక్ పాండ్యా నాయకత్వం అద్భుతంగా ఉంది. అది ముంబై జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.