spot_img
Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ క్రికెటర్ కెరియర్ కూడా ఇలానే సాగుతోంది. ఒకప్పుడు ఇతడు అంటే మెంటల్ మ్యాడ్ లాగా ఉండేది. అతడు ఇన్నింగ్స్ మరణ మాస్ లాగా అనిపించేది. కానీ మనోడు దారి తప్పాడు. ట్రాక్ మార్చాడు. మైకేల్ మదన కామరాజు అవతారం ఎత్తాడు. చివరికి స్థాయిని కోల్పోయాడు. స్థానాన్ని కూడా కోల్పోయాడు. పైకి కవరేజ్ వేరే విధంగా ఇస్తున్నప్పటికీ.. అసలు జరిగిన వ్యవహారం వేరే ఉంది. అందువల్లే ఇప్పుడు పుట్టి మునిగే ప్రమాదం వచ్చింది. ఇదంతా చదివిన తర్వాత మీకు హార్దిక్ పాండ్యా గుర్తుకు వస్తే అది మా తప్పు కాదు. ఎందుకంటే అతడి ఆట.. అతడి వ్యవహార శైలి అలా ఉన్నాయి కాబట్టి.

ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా అంత గొప్పగా ఆడలేదు. ముంబై జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేదు. దీంతో కొన్ని మ్యాచ్లకు అతడు సారధిగా వ్యవహరించలేదు. అంత కాదు వచ్చే ఐపీఎల్ అతడు ముంబై జట్టు కెప్టెన్ గా ఉండే అవకాశం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. లక్నో లేదా ఢిల్లీ జట్టుకు సారధిగా మారిపోతాడని తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టి20 జట్టులో లేడు. వన్డే జట్టులో కూడా లేడు. వచ్చే విశ్వసమరంలో ఆడుతాడో లేడో కూడా తెలియదు. అయితే ఎలాగైనా సరే జట్టులో స్థానాన్ని సంపాదించుకోవాలని అతడు తాపత్రయ పడుతున్నాడు. ఐపీఎల్ తర్వాత అతడు పెద్దగా కనిపించడం మానేశాడు. అతడిని ఎందులోనూ కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో తాను చేసిన తప్పేంటో అతనికి అర్థమైంది. క్రికెట్ ను పట్టించుకోకుండా పక్కన పెడితే తన పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థమైంది. అందువల్లే ఐపీఎల్ తర్వాత సామర్ధ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందువల్లే ఆఫ్గనిస్తాన్.. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లలో అతడు కనిపించలేదు. పైకి సామర్థ్య లోపం అని చెబుతున్నప్పటికీ.. హార్దిక్ పాండ్ ఆట తీరు ఏమాత్రం బాగోలేదు.. బౌలింగ్ సరిగ్గా వేయలేకపోతున్నాడు.

బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. సారధి కూడా సక్రమంగా ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు.. విదేశాలలో చిల్ అవుతున్న దృశ్యాలు మాత్రమే హార్దిక్ పాండ్యా నుంచి కనిపిస్తున్నాయి. ఒక ప్రొఫెషనల్ ఆటగాడికి ఇటువంటి ప్రైవేట్ లైఫ్ అవసరమే. కాని దాని కంటే ముందు బతుకును ఇచ్చిన క్రికెట్ చాలా అవసరం. దాన్ని మర్చిపోయాడు కాబట్టి మళ్ళీ వెతుక్కునే పనిలోపడ్డాడు హార్థిక్ పాండ్యా.

తన ఆట తీరును పూర్తిగా మెరుగుపరచుకోవడానికి హార్దిక్ పాండ్యా ప్రతిరోజు 12 ఓవర్ల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. శరీర కదలికలలో వేగం పెంచుకోవడానికి కాంక్రీట్ వికెట్ల మీద ప్లాస్టిక్ బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే జాతీయ జట్టులో చేరడమే లక్ష్యంగా అతడు అడుగులు వేస్తున్నాడు. అయితే అతడికి ఎర్ర తివాచీ స్వాగతం లభిస్తుందా.. స్పీడ్ బ్రేకర్ ఎదురవుతుందా.. ఇదంతా టీమిండియా కోచ్ చేతిలోనే ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Oktelugu Epaper