Champion Trophy వెంటనే బిసిసిఐ ఫిజియోథెరపిస్టులు మైదానంలోకి వచ్చారు. కొద్దిసేపు రిషబ్ పంత్ కు మర్దన చేశారు. ఆ తర్వాత అతను మళ్లీ మైదానంలోకి వచ్చాడు.. బ్యాట్ అందుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ.. అతడిలో మునుపటి ఉత్సాహం కనిపించలేదు.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడి కాలు విరిగింది. దీంతో రెండు సంవత్సరాల పాటు అతడు చికిత్స పొందాడు. మైదానానికి దూరంగా ఉండి.. నేషనల్ క్రికెట్ అకాడమీ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. చివరికి కోలుకున్నాడు. గత ఐపిఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. ఉత్సాహంగా బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ జట్టుకు ట్రోఫీ అందించలేకపోయినప్పటికీ.. కొన్ని గుర్తుంచుకో తగిన విజయాలు మాత్రం అందించాడు. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడటంతో భారత జాతీయ జట్టులో రిషబ్ పంత్ కు మళ్ళీ స్థానం లభించింది. పలు సిరీస్లలో రిషబ్ పంత్ ఆడాడు. కొన్ని చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల వరద పారించాడు.
కోలుకుంటున్నాడు
ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి రిషబ్ పంత్ కు గట్టిగా తగిలింది. గతంలో అతడికి ఎక్కడైతే సర్జరీ జరిగిందో అక్కడే బంతి తగలడంతో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియోలు మైదానంలోకి వచ్చారు. అతడు కాలికి కట్టుకట్టుకొని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది కష్టమేనని వార్తలు వినిపించాయి. బీసీసీఐ వర్గాలు కూడా ఔను అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాయి. అయితే రిషబ్ పంత్ సోమవారం జరిగిన ప్రాక్టీస్ లో ఎటువంటి కట్టలేకుండానే పాల్గొన్నాడు. ఫీలింగ్ డ్రిల్స్ కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఈ నెల 20 న బంగ్లాదేశ్ తో దుబాయ్ వేదికగా తలపడనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో పోటీ పడనుంది..పాక్ తో జరిగే మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాకిస్తాన్ పై చేయి సాధించింది.. ఇప్పుడు 2017 నాటి ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అటు పాకిస్తాన్ కూడా 2017 నాటి మ్యాజిక్ రిపీట్ చేయాలని సమాయత్తమవుతోంది. మొత్తానికి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన క్రికెట్ ఆనందాన్ని అందించనుంది.