Gautam Gambhir- MS Dhoni: టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఐపీఎల్ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో గొడవ పడ్డాడు. తాజాగా మాజీ కెప్టెన్, ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేద్రసింగ్ ధోనీని టార్గెట్ చేశాడు. మిస్టర్ కూల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాజాగా గంభీర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
సమిష్టిగా రాణించాం..
రాజకీయాలను తలపించేలా క్రికెట్‌లోనూ రాజకీయాలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తానొక్కడినే తెలంగాణ సాధించానని చెప్పుకుంటారు. కానీ సబ్బండవర్గాలు ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. కానీ క్రెడిట్ మొత్తం కేసీఆర్ కొట్టేశారు. చివరకు తెలంగాణ ఇచ్చిన పార్టీకి కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే తరహాలో గంభీర్ టీమిండియా మాజీ సారథి ఎంఎస్.ధోనీపై వ్యాఖ్యలు చేశారు. 2007, 2011 ప్రపంచకప్‌లలో జట్టు సమష్టిగా రాణించడం వల్ల భారత్ విజేతగా నిలిచిందన్నారు. కానీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని మాత్రమే హీరోను చేసేశారని ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న గౌతమ్ గంభీర్ విమర్శించాడు. ప్రచార బృందం గట్టిగా పని చేయడం వల్లే ధోనికి ఆ పేరు వచ్చిందని అన్నాడు.
తాజాగ పొగడ్తల నేపథ్యంలో..
ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్ రోహిత్‌శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ నుంచి తప్పుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించాలని ఇంకొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ధోనీని తెరపైకి తెచ్చారు. ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం ధోనీకే సాధ్యం అవుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు.
సమష్టి వైఫల్యమే..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి సమిష్టి వైఫల్యమే కారణమని గంభీర్ అభిప్రాయపడ్డారడు. ‘ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడమే. ఇతర క్రికెట్ జట్లు సమష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తాయి. భారత్ జట్టు సభ్యులు మాత్రం వ్యక్తిగత ఆటపైనే దృష్టిపెట్టారు’ అని విమర్శించాడు. ‘2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిందంటే నాటు ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగే ప్రధాన కారణం. ఈ రెండు టోర్నీల్లోనూ యువీనే జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ పీఆర్ ఏజెన్సీ బృందాలు ధోనీని హీరోని చేసేశాయి’ అని గంభీర్ పేర్కొన్నాడు.
గంభీర్ వ్యాఖ్యలపై మండిపాటు..
మిస్టర్ కూల్ ధోనీపై గంభీర్ చేసిన వ్యాఖ్యలను ధోనీ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని పేర్కొంటున్నారు. గంభీర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల కోహ్లీతోనూ కావాలనే గొడవ పడ్డాడని అంటున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Gautam gambhir made shocking comments on ms dhoni
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com