Prabhas Srinu: సీనియర్ నటి తులసితో ఎఫైర్ వార్తలపై ప్రభాస్ శ్రీను స్పందించారు. ఆయన ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటి తులసి-ప్రభాస్ శ్రీను ఈ మధ్య వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఇందుకు వారి ప్రవర్తన కూడా కారణమైంది. ఆలీతో సరదాగా షోకి వీరిద్దరూ కలిసి వచ్చారు. అత్యంత సన్నిహితులు మాదిరి మెదిలారు. ఒకరినొకరు డార్లింగ్ అని పిలుచుకోవడం చూసి అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ వార్తలపై అటు తులసి కానీ ఇటు ప్రభాస్ శ్రీను కానీ స్పందించలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను ఓపెన్ అయ్యారు. తులసి సీనియర్ నటి. అమ్మతో సమానం. ఆమెతో నాకు అలాంటి సంబంధం అంటగట్టారు. నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. డార్లింగ్ మూవీ షూటింగ్ సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆమె పెద్ద నటి. జీవితంలో ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఓ మూవీ షూటింగ్ సమయంలో ఆమె నన్ను చనువుగా డార్లింగ్ అని పిలిచారు. దానికే తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రభాస్ శ్రీను అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ… మాపై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆమె నాకు మెసేజ్ పెట్టారు. మీ భార్య కూడా అపార్థం చేసుకుంటుందేమో ఆమెకు చెప్పని సలహా ఇచ్చింది. నా భార్య డాక్టర్. ఆమెను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటివి ఆమె నమ్మరని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆ రూమర్స్ చదివినప్పుడు ఇద్దరం నవ్వుకుంటామని చెప్పుకొచ్చారు. తులసితో తనకు ఎలాంటి ఎఫైర్ లేదు, ఆమె తల్లితో సమానమని ప్రభాస్ శ్రీను కుండబద్దలు కొట్టారు.
హీరో ప్రభాస్ యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు శ్రీను పరిచయమట. ఆయన హీరో అయ్యాక శ్రీనును ప్రోత్సహించారు. ప్రభాస్ ప్రతి మూవీలో శ్రీను ఉంటాడు. ఆయా మధ్య ఇద్దరికీ విబేధాలు తలెత్తాయనే పుకార్లు వినిపించాయి. ఇక తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె సుదీర్ఘ సినిమా ప్రస్థానం కలిగి ఉన్నారు.