https://oktelugu.com/

గంగూలీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సడెన్ గా గుండెపోటుకు గురవ్వడం క్రికెట్ అభిమానులు, క్రికెటర్లను షాక్ కు గురిచేసింది. శనివారం ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో మూడు చోట్ల రక్తనాళాలు మూసుకుపోయాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ఒక స్టంట్ వేసి ఈరోజు మరో రెండు స్టంట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. సౌరవ్ కు చికిత్స అందిస్తున్న ఉడ్ లాండ్స్ ఆస్పత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2021 / 12:52 PM IST
    Follow us on

    బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సడెన్ గా గుండెపోటుకు గురవ్వడం క్రికెట్ అభిమానులు, క్రికెటర్లను షాక్ కు గురిచేసింది. శనివారం ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో మూడు చోట్ల రక్తనాళాలు మూసుకుపోయాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ఒక స్టంట్ వేసి ఈరోజు మరో రెండు స్టంట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

    సౌరవ్ కు చికిత్స అందిస్తున్న ఉడ్ లాండ్స్ ఆస్పత్రి తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అందులో పేర్కొన్నారు. ఆయన గుండెకు యాంజియో ప్లాస్టీ నిర్వహించామని.. అనంతరం కోలుకున్నట్టు తెలిపారు. గంగూలీ గుండె పనితీరును తెలుసుకునేందుకు ఆయనకు సోమవారం చెక్ అప్ ఈకో కార్డియోగ్రఫీ నిర్వహిస్తామని వివరించారు.

    గంగూలీ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యపరిస్తితిని నిరంతరం పర్యవేక్షిస్తామని.. కుటుంబ సభ్యులతో చర్చించి ఈరోజు ఉదయం 9 మంది సభ్యులతో కలిసి ఆపరేషన్ పై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి..

    ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఉడ్ లాండ్స్ ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఆయనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని వైద్యులు అందులో పేర్కొన్నారు.