Gambhir England move shocks senior player : త్వరలో జరిగే టెస్ట్ సిరీస్ కు భారత జట్టు మేనేజ్మెంట్ యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పించింది. రవీంద్ర జడేజా, బుమ్రా, కేఎల్ రాహుల్ మినహ.. అందరూ యువ ఆటగాళ్లకే చోటు కల్పించింది. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాల్సి ఉంది. మొత్తంగా వచ్చిన అవకాశాలను యంగ్ ప్లేయర్లు గనుక వినియోగించుకుంటే తిరుగు ఉండదు. అప్పుడు ఇక వారంతా జట్టులో తమ స్థానాన్ని మరింత స్థిరం చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతుండగానే సోషల్ మీడియాలో ఒక ప్రచారం సరికొత్త చర్చకు దారితీస్తోంది. జాతీయ మీడియాలోనూ కొన్ని చానల్స్ ఇదే అంశంపై కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇంగ్లీష్ జట్టుతో త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్ లో గిల్ సేనలో వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నాడు. అయితే అతడికి అవకాశం ఇవ్వాలని ఆలోచన మేనేజ్మెంట్ కంటే ముందు గౌతమ్ గంభీర్ కు వచ్చిందని తెలుస్తోంది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వాలని గౌతమ్ గంభీర్ మదిలో ఉందని తెలుస్తోంది. రవీంద్ర జడేజా గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతని ప్రదర్శన చెప్పుకునే అంత గొప్పగా లేదు. పైగా అతడు ఇటీవల మ్యాచులలో ఊహించిన అంత స్థాయిలో వికెట్లు సాధించలేదు. ఒకవేళ అతడు ఇంగ్లీష్ గడ్డమీద ప్రభావం చూపించలేకపోతే.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించాలని గౌతమ్ గంభీర్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గౌతమ్ గంభీర్ కు అత్యంత ఇష్టమైన ఆల్రౌండర్. దీంతో అతనికి తొలి టెస్ట్ లో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది.
Also Read : పాపం పండింది.. ఆర్సీబీపై కేసు నమోదైంది..
ఇక రవీంద్ర జడేజా చాలా సంవత్సరాలుగా టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా మనదేశంలో అతడి స్పిన్ బౌలింగ్ కు తిరుగులేదు. ఉపఖండంలోనూ అదిరిపోయే గణాంకాలు అతడి సొంతం. అయితే ఉపఖండం అవతల అతని ప్రదర్శన గొప్పగా లేదు. ముఖ్యంగా కంగారు, ఇంగ్లీష్, సఫారీలపై అతడి రికార్డు గొప్పగా లేదు. గడచిన ఐదు సంవత్సరాలలో ఫారిన్ కంట్రీస్ లో జడేజా 13 టెస్టులు ఆడాడు. అతడి సగటు 37.22 గా ఉంది. అతని మొత్తం బౌలింగ్ సగటు 24.14 తో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువ.. బ్యాటింగ్ పర్వాలేదు అనుకుంటున్నప్పటికీ.. స్పిన్ విభాగం లో మాత్రం అతడు వికెట్లను సాధించడంలో విఫలమవుతున్నాడు.. ఇవన్నీ చూసిన తర్వాతే గౌతమ్ గంభీర్ రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను భర్తీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది… వాషింగ్టన్ సుందర్ గతంలో గబ్బాలో కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.. అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ ను అత్యంత కట్టుదిట్టంగా చేస్తాడు.. ఇక పరుగులు తీయడంలో కూడా వేగాన్ని ప్రదర్శిస్తాడు. అందువల్లే గౌతమ్ గంభీర్ సుందర్ పై నమ్మకాన్ని పెంచుకున్నాడని తెలుస్తోంది.