Trivikram – Allu Arjun movie: ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు… కొందరు ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ లను సాధించడం లేదు. కానీ మరికొందరు మాత్రం చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నారు…
సినిమా ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది అనుకోని కారణాలవల్ల కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా భారీ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చూస్తుందని అల్లు అర్జున్ నమ్ముతుండటం విశేషం… అయితే మొదట అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనప్పటికి పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తే నీ మార్కెట్ భారీగా పడిపోతుంది. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేయమని చెప్పడంతో ఆయన అట్లీనే ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అల్లు అరవింద్ వల్లే ఆ ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయిందని త్రివిక్రమ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు.
Read Also: ఇండియాలో మాఫియా సినిమాలు తీసే దమ్మున్న దర్శకుడు ఆయన ఒక్కడేనా..?
మరి ఏది ఏమైనా కూడా అట్లీ ప్రాజెక్టు తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉండబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది… ఇక ఏది ఏమైనా ఇకమీదట రాబోయే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ ఆచితూచి మరి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తాడా? లేదా అనేది… ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి అల్లు అర్జున్ కి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది.
పుష్ప 2 (Pushpa 2) సినిమా బాహుబలి 2 (Bahubali 2) రికార్డును బ్రేక్ చేయడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేసింది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ రోజురోజుకి భారీ రేంజ్ లో విస్తరిస్తుందనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి అల్లు అర్జున్ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…