Ravi Shastri: భారత క్రికెట్ జట్టులో ఉన్న రాజకీయాలు ఎందులో ఉండవు. పేరుకేు సమష్టి జట్టు కానీ ఎవరి రాజకీయాలు వారివే. జట్టు సభ్యుల ఎంపిక దగ్గర నుంచి అన్ని రాజకీయాలే. ఆటగాళ్లను మార్చాలన్నా, కోచ్ ను తీసేయాలన్నా, కెప్టెన్ ను మార్చాలన్నా రాజకీయాలతోనే నడుస్తుంది. కానీ ప్రతిభకు మాత్రం పెద్దపీట వేయడం అనేది ఉండదు. ఎవరు చెంచా గిరి చేస్తే వారిని నియమించడం పరిపాటే. ఇందులో భాగంగానే జట్టు రాజకీయాలపై అప్పుడప్పుడు దుమారం రేగుతూనే ఉంటుంది.

తాజాగా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను జట్టులోనుంచి తీసేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నాలు చేశాడని కుండబద్దలు కొట్టాడు. దీంతో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. కోచ్ గా ఉన్న సమయంలోనే తనపై కుట్రలు జరిగాయని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో రవిశాస్త్రి వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తన ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాడని చెబుతున్నారు.
అయితే గంగూలీకి ఆయనకు పడదనే విషయం మాత్రం చాలా మందికి తెలుసు. క్రికెట్లో దిగ్గజంగా పేరు తెచ్చుకున్రన రవిశాస్త్రి ఎవరిపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తారనే పేరుంది. దీంతోనే ఆయనను తొలగించాలని ఆయన పదవిలో చేరిన తరువాత తొమ్మిదో నెల నుంచి తీవ్రంగా ప్రయత్నాలు సాగించినట్లు తెలిపాడు. దీంతో క్రికెట్లో ఉన్న రాజకీయాలంటే అందరికి కూడా ఆసక్తి ఉన్న మాట వాస్తవమే.
Also Read: మెగా వేలంలోకి ‘కీ’ ప్లేయర్స్.. వీరంతా ఒకే జట్టులో ఉంటేనా?
మరోవైపు కెప్టెన్సీ మార్పుపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా రాజకీయాలే చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. కెప్టెన్ గా విరాట్ కోహ్లి సమర్థుడిగానే పేరున్నా రాజకీయ కారణాలతోనే ఆయనను పదవి నుంచి తప్పించారనే విమర్శలు చేస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ పటుత్వంపై కూడా భిన్న వాదనలే వినిపిస్తున్నాయి. ఆయన ప్రపంచ కప్ తీసుకురాగలడా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు ఏర్పడింది? విశేషాలేంటీ