Homeఎంటర్టైన్మెంట్F3 Movie: ఛార్మినార్ వద్ద సాంగ్ షూట్ లో సందడి చేస్తున్న ఎఫ్ 3 మూవీ...

F3 Movie: ఛార్మినార్ వద్ద సాంగ్ షూట్ లో సందడి చేస్తున్న ఎఫ్ 3 మూవీ యూనిట్…

F3 Movie: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో జరుగుతోంది.

venkates and varun tej f3 movie shooting in charminar area

ఎప్పుడూ బిజీగా ఉండే ఛార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి షూటింగ్ చేస్తున్నారు. సూఫీ సంగీతకారుల వేషధారణలో కొందరు, ముస్లిం టోపీ ధరించి మరికొందరు ఉన్నారు షూట్ లో పాల్గొంటున్నారు. సినిమాలోని ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా ఈ సినిమా షూటింగ్ చేశారు. ‘ఎఫ్ 2’ సినిమాకు ఇది సీక్వెల్ కాదని, కానీ అందులో క్యారెక్టరైజేషన్స్ తీసుకుని కొత్త కథతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు అని అంటున్నారు. కొత్తగా కథానాయిక సోనాల్ చౌహన్‌ను ఈ మూవీకి తీసుకున్నారు. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎఫ్ 2’ గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ‘బొమ్మ ఎప్పుడు పడితే… అప్పుడే నవ్వుల పండగ’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version