Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: ఊ అంటారా సాంగ్ బ్రహ్మీ ఎడిట్ వెర్షన్ పై స్పందించిన డిఎస్పీ... సూపర్...

Pushpa Movie: ఊ అంటారా సాంగ్ బ్రహ్మీ ఎడిట్ వెర్షన్ పై స్పందించిన డిఎస్పీ… సూపర్ అంటూ రీట్వీట్

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మీక మందన్నా జంటగా నటిస్తున్న ‘పుష్ప. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. కాగా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ నెల 17 న రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతుంది చిత్ర బృందం. సాధారణంగా సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్​ఫామ్​లోకి వచ్చి సుకుమార్​.. ఈ సినిమాతో మరో భారీ హిట్​ అందుకోవాలని చూస్తున్నాడు.

music director respond about pushpa item song as brahmi version

ఇక సుకుమార్​- దేవి శ్రీ కాంబోలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్​ కూడా స్పెషల్ ​గానే ఉంటుంది. ఈ క్రమం లోనే పుష్ప లోని ఐటెం సాంగ్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. “ఊ అంటావా మామ… ఊహూ అంటావా మామ” పేరుతో వచ్చిన ఈ సాంగ్​లో సమంత తన అందాలు ఆరబోస్తూ… హాట్​ లుక్స్​తో కుర్రకారి హృదయాల్ని కొల్లగొడుతుంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

విడుదలైన 12 గంటల్లోనే 8 మిలియన్​ వ్యూస్​కు చేరుకుంది. ప్రస్తుతం 10 మిలియన్స్ చేరువలో దూసుకెళ్లిపోతోంది. దీంతో దేవిశ్రీ తన మ్యూజిక్​తో మరోసారి మాయ చేశారనే చప్పాలి.‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సమంతపై చిత్రించిన ఈ ఐటెమ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోంది. అయితే, ఇదే పాటను ఓ నెటిజన్ బ్రహ్మానందం సీన్లతో రీమిక్స్ చేసి.. ట్వీట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆ పాటను స్వరపరిచిన దేవీశ్రీ ప్రసాద్ కూడా రిట్వీట్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ హిల్లెరియస్… సూపర్ ఎడిట్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఈ వీడియోను రీట్వీట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బ్రహ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఎడిట్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version