Homeక్రీడలుFIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్: బ్రాంజ్ ఫైనల్ అంటే ఏంటి.. ఎప్పుడు మొదలైంది..

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్: బ్రాంజ్ ఫైనల్ అంటే ఏంటి.. ఎప్పుడు మొదలైంది..

FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్ లో మరో అసక్తికరమైన సమరానికి రంగం సిద్ధమైంది. ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ స్పెయిన్, అర్జెంటీనా మధ్య ఆదివారం జరగనుంది.దీని కంటే ముందే మరో అసక్తికరమైన పోటీ జరగబోతోంది. ఈ పోటీని వీక్షించేందుకు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ లో పోటీపడేందుకు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి.

సెమీ ఫైనల్ మ్యాచ్ లలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఓడిపోయాయి. ఫ్రాన్స్ స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. అర్జెంటీనా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఓడిపోయిన ఈ జట్లు మరో సమరంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టుకు మూడో స్థానం లభిస్తుంది. దీనిని ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులు బ్రాంజ్ పైనల్ అని పిలుస్తుంటారు.

బ్రాంజ్ పైనల్ ను ఫిఫా 1934 నుంచి నిర్వహిస్తోంది. 1938లోనూ బ్రాంజ్ పైనల్ పోటీ జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1942,1946లో టోర్నీలు నిర్వహించలేదు. 1950లో ఫిఫా కప్ ను నాకౌట్ విధానంలో కాకుండా, రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిని పాటించారు. లీగ్ స్టేజ్ లో నాలుగు గ్రూప్ లలో అగ్రస్థానం నిలుపుకున్న జట్లకు మళ్లీ ఫైనల్ లీగ్ పోటీ నిర్వహించారు. సాధించిన పాయింట్ల ప్రకారం తొలిమూడు స్థానాలలో నిలిచిన జట్లకు మళ్లీ ఫైనల్ లీగ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీ ప్రకారం థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ అవసరం లేకుండా పోయింది.

1954 నుంచి ప్లే ఆఫ్ సమరం మొదలైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్ పోటీలో ఎంబాపే గోల్డెన్ బూట్ రేసులో ముందు వరసలో ఉన్నాడు. ఫ్రాన్స్ తరఫున ఆడుతున్న అతడు గోల్స్ కనక చేస్తే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఫిఫా వరల్డ్ కప్ లో ఎంబాపే ఏకంగా 8 గోల్స్ సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు మెస్సీతో సమానంగా అతడు గోల్స్ చేయడం విశేషం.

ఫిఫా ప్రపంచ కప్ సాధించిన విజేతలకు ఈసారి బంగారు చేతి ఉంగరాలు ఇవ్వబోతున్నారు. అమెరికాలో జరిగే క్రీడాపోటీలలో విజేతలకు బంగారు ఉంగరాలు ఇస్తుంటారు. అది అక్కడి సంప్రదాయం. అమెరికా సంయుక్తంగా ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు అతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో విజేతలకు ప్రపంచ కప్ ట్రోపీ రూపంలో 2026 చేతి ఉంగరాలు తయారు చేయించింది. ఇందులో 30 ఉంగరాలను విజేత జట్టులో సభ్యులకు ఇస్తుంది. మిగతా రింగులను అభిమానులకు ఇస్తారు. ఫ్రీగా కాదు..డబ్బులకే..ఫైనల్ మ్యాచ్ స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరగుతుంది. ఈ పోటీకి ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరవుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular