Homeఎంటర్టైన్మెంట్The Paradise: 'ప్యారడైజ్' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఈసారి లెక్క తప్పేదే లేదు...

The Paradise: ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది… ఈసారి లెక్క తప్పేదే లేదు…

The Paradise: ‘అష్టాచమ్మ’ సినిమాతో హీరోగా మారిన నాని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. కెరియర్ మొదట్లో ఆయన లవ్ స్టోరీ ల మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలతో ప్రేక్షకులను అలరించాడు. నాని కెరియర్ మొదట్లో మన పక్కటి కుర్రాడిలా ఉంటాడు అనే పేరును సంపాదించుకున్నాడు. కానీ దసరా సినిమాతో మాస్ […]

The Paradise: ‘అష్టాచమ్మ’ సినిమాతో హీరోగా మారిన నాని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. కెరియర్ మొదట్లో ఆయన లవ్ స్టోరీ ల మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలతో ప్రేక్షకులను అలరించాడు. నాని కెరియర్ మొదట్లో మన పక్కటి కుర్రాడిలా ఉంటాడు అనే పేరును సంపాదించుకున్నాడు. కానీ దసరా సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేయడమే ఎజెండా గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

దసరా సినిమాతో 100 కొట్ట క్లబ్ లో చేరిన నాని ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో అంతకు మించిన వసూళ్లను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ మూవీతో నాని ఎలాంటి విజయాలను అందుకుంటాడు. తద్వారా ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ప్యారడైజ్ సినిమాని మొదట మార్చి 26 వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుందంటూ అనౌన్స్ చేశారు. అది కూడా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు… మరో రెండు రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ని సైతం రివిల్ చేయబోతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్యారడైజ్ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోగలిగితే మాత్రం ఈ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేయగలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికి నాని సైతం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper