Kerala T20 League: మామూలు వేగం కాదు.. బంతిమీద కోపం ఉన్నట్టు కొట్టాడు. బౌలర్ తో దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు ఆడాడు. ఎవరినీ ఉపేక్షించలేదు. దంచి దంచి కొట్టాడు.. బంతి పగిలేలా కొట్టాడు.. చూస్తుండగానే 42 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసానికి అసలు సిసలైన అర్ధాన్ని చెప్పాడు.
Also Read: విరాట్ కోహ్లీ నెంబర్ వన్ క్రికెటర్ మాత్రమే కాదు.. ఆచరించాల్సిన వ్యాపార సిద్ధాంతం కూడా!
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కేరళ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కొచ్చి బ్లూ టైగర్స్ ఆటగాడు సంజు శాంసన్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 42 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కొల్లం జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. చేజింగ్ లో కొచ్చి జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా సంజు 121 పరుగులు చేశాడు. 51 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. సంజు చివర్లో అవుట్ అయినప్పటికీ.. ఆశిక్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి విజయ లాంచనాన్ని ముగించాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టి కొచ్చి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
సంజు వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతని అభిమానులు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలను ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. “కొంతకాలంగా సూర్య కుమార్ యాదవ్ సరైన క్రికెట్ ఆడటం లేదు. సారధిగా అతడు ఓకే అయినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. సంజు మాత్రం వదల కొడుతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో కూడా పరవాలేదు అనిపించాడు. అటువంటి ఆటగాడికి సారధిగా అవకాశం ఇస్తే జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆసియా కప్ లో సారధ్య బాధ్యతలు సంజుకు అప్పగించాలని” అతడి అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.
Also Read: అక్కడున్నది ద్రావిడ్ కాదు.. పూజారకు సినిమా అర్థమైంది.. రిటైర్మెంట్ వెనుక పెద్ద కథ
ఇక ఇటీవల సంజు గురించి అతడి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.. తన కుమారుడికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాలు కల్పించకుండా జట్టుకు దూరం పెట్టారని కొంతమంది ప్లేయర్ల మీద.. సారధుల మీద సంజు తండ్రి ఆరోపణలు చేశాడు. ఇప్పటికైనా తన కొడుకు ప్రతిభను గుర్తించాలని.. అతని ఆట తీరు బాగుంటుంది కనుక సముచిత స్థానం కల్పించాలని అతడు డిమాండ్ చేశాడు.. చివరికి సంజుకు ఇటీవల వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
Sanju Samson turning pressure into PLEASURE since forever #KCL2025 pic.twitter.com/YOvBLdFrB8
— FanCode (@FanCode) August 24, 2025