Elephant Tomb: హిందూమతంలో ఏనుగుది( elephant) ప్రత్యేక స్థానం. అదో ఆధ్యాత్మిక జంతువుగా అంతా భావిస్తారు. దైవానికి ప్రతీకగా భావించి పూజిస్తుంటారు. అయితే ఓ గ్రామస్తులు ఏ పని ప్రారంభించినా.. ఏ కార్యక్రమానికి ఉపక్రమించినా.. ఏనుగు సమాధిని సందర్శించి పూజించిన తర్వాతే ప్రారంభిస్తారు. ఈ ఆచారం కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు లో శతాబ్దాలుగా ఉంది. ఆ సమాధికి 123 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే దీనికోసం ఆ గ్రామస్తులకు తప్ప బయట వారికి పెద్దగా తెలియక పోవడం విశేషం.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
* దేశవ్యాప్తంగా ఆలయాలు.. అహోబిలం( Ahobilam) మఠానికి దేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణంలో కూడా అహోబిలం మఠం, ఆలయం ఉంది. కుంభకోణం నుంచి మఠాధిపతులు అహోబిలం సందర్శించేవారు. అయితే కుంభకోణం, అహోబిలం క్షేత్రాల మధ్య దాదాపు 546 కిలోమీటర్ల దూరం ఉంది. పూర్వకాలంలో కాశి, రామేశ్వరం రహదారిగా పిలవబడిన ప్రస్తుత జాతీయ రహదారిపై యాత్రికులు ఏనుగులు, గుర్రాలు, కాలినడకన మాత్రమే ప్రయాణం చేసేవారు. మఠాధిపతులు తమ ప్రయాణాల్లో ఆచార రీత్యా ఏనుగులు, గుర్రాలతో మాత్రమే వెళ్లేవారు.
* చనిపోయిన చోటే సమాధి..
1902 సంవత్సరంలో పీఠాధిపతులు కుంభకోణం నుంచి అహోబిలం వస్తుండగా ఓ ఏనుగు జబ్బు పడింది. కుంభకోణం( kumbhakonam ) నుంచి సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించి.. కడప జిల్లా గుడిపాడు వద్దకు చేరుకున్న ఏనుగు అస్వస్థతో ముందుకు కదల్ లేకపోయింది. అక్కడే కన్ను మూసింది. అహోబిలం మట్టం నిర్వహకులు గ్రామస్తుల సహకారంతో ఏనుగును రహదారి పక్కనే ఖననం చేశారు. అక్కడే సమాధి చేశారు. ఏనుగు శిలా విగ్రహాన్ని కూడా సమాధి వద్ద ప్రతిష్టించారు. వేట అహోబిలం వెళ్లే సమయంలో ఏనుగు సమాధి వద్ద ఆగి పూజలు చేసేవారు. అయితే ఇప్పుడు ఆ గ్రామస్తులకు ఏనుగు సమాధి ఆరాధ్య దైవంగా మారింది. ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ముందుగా ఏనుగు సమాధి వద్ద ఆగి కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా చేస్తే చేసే పని దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం. అయితే ఆ సమాధి 123 సంవత్సరాలు అవుతున్న చిక్కుచెదరలేదు.