Hardik Pandya: వెస్టిండీస్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. పొరపాటున ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ పూర్తిగా విండీస్ కైవసం అయ్యేది. అలా జరగకపోవడం భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం అయినప్పటికీ …మ్యాచ్లో హార్దిక్ పాండ్య బిహేవియర్ కారణంగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిజంగా కెప్టెన్ పదవికి అతను పనికిరాడు అని అతని ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
https://twitter.com/AviRaaz20/status/1688996885816905728?s=20
మ్యాచ్ కీలకమైన సమయం లో హార్దిక్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ vs వెస్టిండీస్ మధ్య గయానా లో నిన్న రాత్రి ముగిసిన మూడవ టి20 మ్యాచ్ టీం ఇండియన్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సరికొత్త యాంగిల్ ప్రజలకు అర్థమయ్యేలా చేసింది . తొలిత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ జట్టు ఎటువంటి తడబాటు లేకుండా ఆడింది.
Most hated 6 by #HardikPandya #INDvsWI #TilakVarma #BCCI pic.twitter.com/U7WVQrN4xC
— Home Minister of Memes in cricket (@lexicopedia1) August 8, 2023
సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ కాంబినేషన్లో సూపర్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ విజయం వైపు దూసుకుంది. కానీ అర్థ సెంచరీకి ఒకే ఒక పరుగు దూరంలో ఉన్న తిలక్ వర్మను కెప్టెన్ హార్దిక్ పాండ్యా చివరి బంతి సమయంలో తీవ్రమైన నిరాశకు గురి చేశాడు. ఒక రకంగా మ్యాచ్ గెలిచిన హార్దిక ప్రస్తుతం అందరి విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
సూర్యకుమార్ కు తిలక్ మంచి సపోర్ట్ ఇవ్వడంతో 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 154 పరుగులకు చేరుకుతుంది. అప్పటికే తిలక్ వర్మ 47 పరుగులు సాధించి తన హాఫ్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నాడు. మరో పక్క క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్ విజయానికి కేవలం 6 పరుగులు కావాల్సి ఉంటుంది.
https://twitter.com/abhishekmalik72/status/1688974585780379648?s=20
18 ఓవర్లో పావెల్ వేసిన ఫస్ట్ నాలుగు బంతులను హార్థిక్, తిలక్ ఇద్దరు రెండు సింగిల్స్ తీయగలిగారు. తిరిగి నాలుగవ బాలులో తిలక్ మరొక సింగిల్ తీయడంతో అతని స్కోర్ 49 కి చేరింది. అర్థ సెంచరీకి కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఉన్న తిలక్ ఆ తరువాత బాల్ తో అర్థ సెంచరీ తో పాటు మ్యాచ్ని కూడా పూర్తి చేస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకొక్క పరుగు తీయగలిగి ఉంటే తిలక్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ సెంచరీల రికార్డ్ చేరేది. అప్పటికి భారత్ విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది…చేతిలో ఇంకా ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో క్రీజులో మరొక బ్యాటర్ ఎవరైనా ఉండి ఉంటే కచ్చితంగా తిలక్ కు బ్యాటింగ్ చాన్స్ ఇచ్చేవాడే.
మొత్తం టీం ని ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ముందుకు నడపాల్సిన కెప్టెన్ హోదాలో ఉన్న హార్ధిక్ పాండ్యా అందరి అంచనాలను తలకిందు చేస్తూ.. కొంపేదో మునిగిపోయినట్టు…భారీ సిక్స్ బాది ఫినిషింగ్ షార్ట్ తన ఖాతాలోనే పడేలా చూసుకున్నాడు. చాలాసార్లు హారతి తన ధోని ఫాలోవర్ అని.. ధోని లాగా ఉండాలి అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఫీల్డ్ లో అతను చేసిన పని అతని మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా 2014లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంలో ధోనీ చేసిన పని గురించి కూడా నటిజన్స్ గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా ఇలాగే 19వ ఓవర్లో లాస్ట్ బాల్ కి సింగిల్ తీసే వసతి ధోనీకి ఉన్నప్పటికీ ఆ రోజు మ్యాచ్లో మంచి పర్ఫామెన్స్ కనబరిచిన కోహ్లీ ఫినిష్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ధోని డిఫెన్స్ ఆడి మరి అతనికి అవకాశం వచ్చేలా చేసాడు.
#HardikPandya #IndianCricketTeam
3Rd class captain in the world pic.twitter.com/bte1eLgWBy— Subrat Nayak (@nsubrat123) August 8, 2023
రన్ తీయడం కోసం కోహ్లీ ముందుకు వస్తున్న ఇది నువ్వే ఫినిష్ చేయాలి అన్నట్టుగా సరిగా చేసి మరీ అతన్ని ఆపేశాడు. ఆ తర్వాత నెట్ లో వైరల్ అయిన ఈ వీడియో ధోనీపై అభిమానులకు మరింత గౌరవాన్ని పెంచింది. ఇప్పుడు హార్దిక్ చేసిన పనితో కోపగించుకున్న నెటిజన్స్ ధోనీకి నీకు పోలిక ఏంటి? ఇది ధోని గొప్పతనం అని క్యాప్షన్ పెట్టి పాత వీడియోని తిరిగి వైరల్ చేశారు. ఏదేమైనాప్పటికీ హార్దిక్ ప్రస్తుతం ట్విట్టర్లో హాష్ ట్యాగ్ సెల్ఫిష్.. అంటూ బాగా ట్రెండింగ్ లో.