Expensive Player in IPL: విరాట్ కోహ్లీ దుమ్ము రేపుతున్నాడు. 36 సంవత్సరాల వయసులోనూ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సూర్య కుమార్ యాదవ్, సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నారు.మరే జట్టు ఆటగాళ్లు అందుకోలేని రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. జట్టు విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుత ఐపిఎల్ లో పరుగులపరంగా అత్యంత విలువైన ప్లేయర్లుగా సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. అయితే ఐపీఎల్ లో పరుగులపరంగా విలువైన ఆటగాళ్లు వీలైతే.. ఒక ఆటగాడు మాత్రం ఒక్క పరుగు చేయడానికి 20 లక్షల వరకు తీసుకుంటున్నాడు. అదేంటి ఐపీఎల్లో ఇలా కూడా ఇస్తారా? అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతోంది కదా.. మీకు వచ్చిన డౌట్ న్యాయమైనదే. ఇంతకీ ఆ విలువైన ఆటగాడు ఎవరు..ఒక్కో పరుగు కోసం అంతలా ఎందుకు వసూలు చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
Also Read: Highest Score in IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో 9 మంది ప్లేయర్లు..ఇదే తొలిసారి!
గత ఏడాది చివర్లో జరిగిన ఐపిఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యంత విలువైన ఆటగాడిగా పేరుపొందాడు. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక రిషబ్ ను ఏకంగా 27 కోట్లకు పర్చేస్ చేశాడు. ఈ ఇతర ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డును పంత్ సృష్టిస్తే.. అత్యధిక ధర చెల్లించి సంజీవ్ గోయంక కూడా సరికొత్త చరిత్రను తన పేరు మీద రాసుకున్నాడు. సంజీవ్ డబ్బులు ఇచ్చినంత ఈజీగా.. పంత్ లక్నో జట్టుకు తను నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ ఇవ్వలేకపోయాడు. ఇప్పటివరకు అతడు విఫలం అవడం తప్ప.. సఫలం అయిన ఒక ఇన్నింగ్స్ కూడా లేదు.
Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ కు భార్య అంటే ఎంత ఇష్టమో? అంతటి త్యాగం చేసేశాడుగా..
సంజీవ్ గోయంకా వెచ్చించిన 27 కోట్లను పరిగణలోకి తీసుకుంటే.. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటివరకు రిషబ్ పంత్ 12 మ్యాచ్లలో ఆడాడు. కేవలం 135 రన్స్ మాత్రమే చేశాడు. రిషబ్ పంత్ ఒకే ఒక హాఫ్ సెంచరీ (63) మాత్రమే చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 100.00 నమోదయింది. ఇక యావరేజ్ అయితే 12.27 వరకే పరిమితం అయిపోయింది. 12 మ్యాచ్లలో అతడి ఇన్నింగ్స్ లో ఒకదాంట్లో 0 పరుగులకే వెనుతిరిగి వచ్చాడు. రిషబ్ పంత్ చేసిన పరుగులను.. అతడికి వెచ్చించిన ధరతో భాగహారం చేస్తే ఒక్కో పరుగుకు అతడు 20 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఒక్కో మ్యాచ్ కు 2.25 కోట్ల వరకు స్వీకరిస్తున్నట్లు లెక్క. ఇంత డబ్బులు తీసుకున్నప్పటికీ.. హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ గా నిలిచినప్పటికీ.. అతడు ఏమాత్రం లక్నో జట్టు విజయాలలో భాగస్వామి కాలేకపోతున్నాడు. చివరికి నాయకుడిగా కూడా విఫలమవుతున్నాడు. అన్నింటికీ మించి లక్నో జట్టులో విఫల సారధిగా చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇదే స్థాయిలో రిషబ్ పంత్ ప్రస్థానం సాగితే.. వచ్చే సీజన్ నాటికి పంత్ వేరే జట్టును వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే ఏ జట్టు యాజమాన్యం కూడా ఇన్నేసి డబ్బులు ఇచ్చి.. ఈ స్థాయిలో ఆడుతున్నప్పటికీ కూడా.. కొనసాగించదు. మరీ ముఖ్యంగా లక్నో జట్టు యజమాని అస్సలు కొనసాగించడు.