Highest Score in IPL 2025 : ఐపీఎల్ లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు పుడుతూనే ఉంటాయి. పాత రికార్డులు కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటాయి. దేశ, విదేశ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతుంటారు కాబట్టి ప్రేక్షకులకు అమితమైన క్రికెట్ ఆనందం లభిస్తుంది. అందుకే ఐపిఎల్ అనేది ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ లీగ్ గా రూపాంతరం చెందింది. కేవలం ఆట మాత్రమే కాకుండా.. సంపాదనపరంగా కూడా ఐపీఎల్ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే లక్ష కోట్ల విలువైన మార్కెట్ క్యాప్టలైజేషన్ ను ఐపీఎల్ సొంతం చేసుకుంది.. 2008లో మొదలైన ఐపిఎల్ ప్రస్థానం.. ఇప్పటివరకు 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని.. 18వ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయింది. అయితే ఈ సీజన్లో మాత్రం ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
ఐపీఎల్ అంటే బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. ప్రత్యర్థి బౌలర్లపై ప్రారంభం నుంచి ఎదురు దాడికి దిగుతుంటారు. ఒకటి లేదా రెండు సందర్భాల్లో మాత్రమే బౌలర్లకు బ్యాటర్లు దొరికిపోతారు. కానీ ఎక్కువసార్లు మాత్రం బంతి మీద కసి ఉన్నట్టు.. బౌలర్ తో శత్రుత్వం ఉన్నట్టు..పిచ్ తో ఏదో గొడవ ఉన్నట్టు బాదేస్తూ ఉంటారు. అయితే ఇలా బంతిని చావబాదిన ప్లేయర్లు ఈసారి ఏకంగా తొమ్మిది మంది దాకా ఉన్నారు. అంటే మిగతావాళ్లు కొట్టలేదని కాదు.. కాకపోతే ఈ తొమ్మిది మంది ప్లేయర్లు ఈ ఐపీఎల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఎందుకంటే వీరుపారించిన పరుగుల వరద అలాంటిది మరి.
ఈ సీజన్లో గుజరాత్, ముంబై, రాజస్థాన్, లక్నో, బెంగళూరు, ఢిల్లీ, ప్లేయర్లు సుదర్శన్, గిల్, సూర్య కుమార్, యశస్వి జైస్వాల్, మార్ష్, విరాట్ కోహ్లీ, రాహుల్, నికోలస్ పూరన్, బట్లర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వీరంతా కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరు దాదాపు 500+ స్కోర్ చేశారు. వాస్తవానికి ఐపీఎల్ చరిత్రలో 9 మంది ప్లేయర్లు ఒక్కొక్కరు 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి.. 2018, 2023 లో 8 మంది ప్లేయర్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2013, 2024 సీజన్లో ఏడుగురు ప్లేయర్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత సాధించారు. కానీ ఈసారి మాత్రం 90 మంది ప్లేయర్లు 500+ స్కోర్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే వీరిలో విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్, సూర్య కుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ విభాగంలో మొదటి మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. అన్నట్టు ఈ ముగ్గురు వీరోచితంగా ఆడటం వల్లే.. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి. సుదర్శన్, గిల్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, బట్లర్ వంటివారు మరిన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి. ఎంత లేదనుకున్న ఈ ప్లేయర్లు ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంది కాబట్టి.. పరుగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.