Surya Kumar Yadav: టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా తమ ఆడే మ్యాచ్లకు తమ భార్యలను కచ్చితంగా తీసుకెళ్తుంటారు. ఇతర ఆటగాళ్లు కూడా తీసుకెళ్లినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారు గైర్హాజరవుతుంటారు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా అలా కాదు.. వారు కచ్చితంగా తాము ఆడే మ్యాచ్ లకు తమ భార్యలను కచ్చితంగా తీసుకెళ్తుంటారు. ఒకటి అరా మిరహా మిగతా అన్ని సందర్భాల్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడారు. అందువల్లేవారు టీమిండియాలో విభిన్నమైన ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇక వీరిలో సూర్య కుమార్ యాదవ్ కూడా ఉంటాడు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం కుటుంబం అయితే.. అంతకుమించి అతడి భార్య దేవీషా శెట్టి.. సూర్య కుమార్ యాదవ్ , దేవిషా శెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఆడే ప్రతి మ్యాచ్ కు దేవి షా హాజరవుతుంటుంది. సూర్య కుమార్ యాదవ్ ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తనను ఎంతో ప్రేమించే భార్యను.. అంతే స్థాయిలో సంతోషపెడుతుంటాడు సూర్య కుమార్ యాదవ్.. అందువల్లే తనకు వచ్చే అవార్డులను తరచుగా తన భార్య దేవిషాకు అంకితం ఇచ్చేస్తుంటాడు. తాజాగా ఢిల్లీతో తలపడిన సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కూడా అందుకున్నాడు.
Also Read: ఆ 11 తోనే ఆగిపోకుంటే.. ఇతడే ఐపీఎల్ ఛాంపియన్! ప్చ్ బాధగా ఉంది భయ్యా!
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్న తర్వాత.. దానిని తన భార్యకు అంకితం ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్. ఇదే విషయాన్ని అతడు ఎంతో ఉద్వేగంగా చెప్పాడు..” నా విజయ వెనుక కుటుంబం ఉంది. కానీ దేవిషా వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. తను నాకు స్నేహితురాలు. అర్థం చేసుకునే అర్ధాంగి. వెంట వచ్చే గైడ్. నా లోపాలను ఎత్తిచూపే విమర్శకురాలు.. నా ఉన్నతి మాత్రమే కోరుకునే శ్రేయోభిలాషి.. ఇలా అన్ని రకాల పాత్రలను ఆమె పోషిస్తూ ఉంటుంది. అందువల్లే ఆమె వెంట ఉంటే నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇంకా ఏదో సాధించాలి అనే కసి పెరుగుతుంది. ఆమెను చూస్తూ మైదానంలో క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం. అందువల్లే ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయగలుగుతున్నాను. ఈ సీజన్లో నేను ఎన్నో గొప్ప పరుగులు చేసినప్పటికీ.. ఇంతవరకు నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాలేదు. అయితే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఈ అవార్డును ఆమెకు అంకితం ఇస్తున్నాను. ఈ సీజన్లో ఇప్పటివరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేదని ఆమె గుర్తు చేసింది. అందువల్లే ఈసారి నాకు అవార్డు వచ్చిందని భావిస్తున్నాను. ఆ అవార్డును ఆమెకు అంకితం ఇస్తున్నాను. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను ఇలా పరుగులు చేయడం వెనుక దేవిషా ఉన్నది కాబట్టి.. ఇది ఆమెకు అంకితం ఇస్తున్నానని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఆయన భార్య ముసి ముసి నవ్వులు నవ్వింది.