spot_img
Homeక్రీడలుEngland Vs Ireland: ఏంటా దంచుకొట్టుడు.. టెస్ట్ ను వన్డేలా ఆడేస్తున్న ఇంగ్లాండ్

England Vs Ireland: ఏంటా దంచుకొట్టుడు.. టెస్ట్ ను వన్డేలా ఆడేస్తున్న ఇంగ్లాండ్

England Vs Ireland: ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అదరగొడుతున్నారు.
టెస్ట్ మ్యాచ్ లో వన్డే తరహాలో ఆడుతూ చెలరేగిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ జట్టు డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఐర్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఈదుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు విజ్రింబించడంతో భారీ స్కోరు నమోదయింది.

లార్డ్స్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అదరగొట్టడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ ను 82.4 ఓవర్లలో
524/4 పరుగులు డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ 208 బంతుల్లో 205 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. బెన్ డకెట్ 178 బంతుల్లో 182 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. డబుల్ సెంచరీతో ఒకరు, భారీ శతకంతో మరొకరు విధ్వంసం సృష్టించగా, జాక్ క్రాలే (56), జో రూట్ అర్థ సెంచరీలతో రాణించారు. అంతకుముందు వెటర్న పైసలు స్టువర్టు బ్రాడ్ 5/51 తో చెలరేగడంతో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 175 పరుగులకే కొత్త కూలింది.

చెలరేగిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. బాదుడే బాదుడు..

ఇటీవల కాలంలో టెస్టుల్లో బజ్ బాల్ అప్రోచ్ అంటూ ఆటలో వేగం పెంచిన ఇంగ్లీష్ క్రికెటర్లు, ఐర్లాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ లోనూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వీరు ఎంత వేగంగా ఆడారంటే.. ఈ మ్యాచ్ ను చూసిన ఫాలోవర్స్ కు ఇది టెస్ట్ మ్యాచా లేక వన్డేనా అన్న డౌట్ వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆరుకుపైగా రన్ రేట్ మెయింటైన్ చేసిన ఇంగ్లిష్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంతోపాటు వేగంగా పరుగులు రాబట్టారు. వీరి వేగం చూస్తుంటే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది. రెండో రోజు మరో 25 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ చేయడం ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.

టెస్టుల్లో ఏడో వేగవంతమైన డబల్ సెంచరీ..

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఓలి పోప్ టెస్టుల్లో ఏడో వేగ వంతమైన డబల్ సెంచరీని, ఇంగ్లాండ్ తరఫున రెండో వేగవంతమైన ద్విశతకాన్ని బాదాడు. సిక్సు తో డబల్ హండ్రెడ్ పూర్తి చేసిన .. 207 బంతుల్లో ఈ మార్కును అందుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్ రికార్డు.. ఈ జట్టు సారథి బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఓవరాల్ గా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టన్ (153) పేరిట ఉంది. ఆస్టల్ తర్వాత స్టోక్స్, సెహ్వాగ్ (168), మెక్ కల్లమ్ (186) ఈ రికార్డును సాధించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ బాధడమే పనిగా పెట్టుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper