England Vs South Africa: ఏం కొట్టుడు అది.. ఎలాంటి కొట్టుడు అది.. మామూలుగా కాదు.. బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేశారు. బెదురు అనేది లేకుండా బంతిని కొట్టారు. బంతిని మైదానం నలుమూలల పరుగులు పెట్టించారు. ఫీల్డర్లకు చుక్కలు చూపించారు. ఆడుతోంది సొంతమైదానంలో కావడంతో అలుపు అనేది లేకుండా పరుగులు సాధించారు. వాస్తవానికి 300 స్కోరు చేస్తారు అనుకుంటే.. ఏకంగా 400కు మించి పరుగులు చేశారు. ఫలితంగా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. వాస్తవానికి తొలి రెండు వన్డేలలో ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇంగ్లాండ్ జట్టు తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేయడం.. ఆ జట్టు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
దుమ్మురేపిన బ్యాటర్లు
మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు జ్ఞానోదయం అయింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా.. చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌత్ అంప్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా రూట్ (100), బెతెల్(110) సెంచరీలతో మోత మోగించారు. ఓపెనర్లు స్మిత్ 62, డకెట్ 31 పరుగులతో ఆకట్టుకోగా.. బట్లర్ 62 పరుగులతో అదరగొట్టాడు.. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 414 పరుగులు చేసింది.. మెన్స్ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు ఏడుసార్లు 400 మించి పరుగులు చేసింది. ఇక ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా 8సార్లు 400 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో బాష్, కేశవ్ మహారాజ్ చెరి 2 వికెట్లు తీశారు.
రికార్డు భాగస్వామ్యం
రెండు వికెట్లకు 117 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టుకు రూట్, బెతెల్ రికార్డు స్థాయిలో భాగస్వామ్యం నిర్మించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 144 బంతుల్లో 182 పరుగులు చేశారు. చివర్లో బట్టలు 32 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ సిరీస్లో తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 131 పరుగులకే కుప్పకూలింది. రెండవ వన్డేలో 325 పరుగులు చేసినప్పటికీ.. ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్ కోల్పోయింది. చివరి వన్డేలో మాత్రం ఏకంగా 414 పరుగులు చేసి అదరగొట్టింది.